Wednesday, February 18, 2026
Homeసాహిత్యంప్రతిబింబాలు

ప్రతిబింబాలు

- Advertisement -

నాన్న అడుగులను
కాసేపు
అనుసరించి చూశాను!
త్యాగానికి దారులు తీశాయి!
అమ్మ ఆలోచనలను
కొంచెం సేపు
అనుకరించి చూశాను!
‘ప్రేమ’ రాగాలు ధ్వనించాయి!
ఇవన్నీ
నాలో ఎక్కడున్నాయని
నిజాయితీగా
‘మనసు’ ను నిలదీశాను!
అవే
నిన్ను చేయిపట్టుకు
నడిపిస్తున్నాయని
ప్రతిధ్వనించింది!
ఒక్కసారిగా
ఆగిపోయాను!
నే వేసే ప్రతి అడుగులో
ఇక ఎప్పటికీ వారు
ప్రతిబింబించాలని!!

  • తిప్పాన హరిరెడ్డి, 9493832412
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు