Homeవిశ్లేషణప్రపంచ శాంతి తక్షణం అవశ్యం

ప్రపంచ శాంతి తక్షణం అవశ్యం

- Advertisement -

‘‘కార్మికుల సంక్షేమం ఆ దేశ ఉత్పాదక శక్తి, ప్రజాస్వామ్య ఉచ్ఛస్థితికి తార్కాణమని గ్రీస్‌ యువత నినదించింది. సామ్రాజ్యవాద దేశాల నెలకొన్న యుద్ధ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి, సామరస్యం, స్వేచ్ఛకోసం గళమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద యుద్ధాలను తక్షణం నిలువరించాలని సంఘటితంగా నినదించారు. గ్రీస్‌లో జరిగిన 34వ గ్రీస్‌ కమ్యూనిస్టు మహాసభలకు దేశవ్యాప్తంగా యువత పెద్ద సంఖ్యలో హాజరైంది. ఈ సందర్బంగా మహాసభ ప్రాంగణం శక్తిమంతమైన ఎర్రనదిగా మారింది. యువతీ, యువకులు భారీ సంఖ్యలో హాజరైన ఈ సభలో యువత అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిరచింది. ఆచాయాలోని అలిస్సోస్‌లో జరిగిన ఈ సమావేశంలో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డిమిట్రస్‌ కౌట్సౌంబాస్‌, కేంద్ర కమిటీ కార్యదర్శి ధోడోరిస్‌ కోట్సాండిస్‌ ప్రధానోపన్యాసం చేశారు. గ్రీస్‌లోని ఆండ్రవిడా, ఆరక్సోస్‌ సైనిక స్థావరాల వద్ద సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు పెద్దఎత్తున జరిగాయి. పెట్టుబడిదారీ దేశాలు ప్రోత్సహించే నాటో ప్రణాళికలో పాల్గొనే దేశాలకు వ్యతిరేకంగా, వ్యాపార ప్రయోజనాల కోసం బూర్జువా పార్టీల మద్దతును ఈ సమావేశం ఖండిరచింది. పలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దేశాలు ఈ సందర్భంగా తమ సంఫీుభావాన్ని ప్రకటించాయి. పలస్తీనా పీపుల్స్‌ పార్టీ ప్రతినిధి రాంజీ సలేం ప్రజల నినాదానికి సంఫీుభావం ప్రకటించారు. దేశ ఉత్పత్తిలో భాగస్వాములైన కార్మికరంగం ప్రజాస్వామ్య ఉచ్ఛ స్థితికి తార్కాణమని పేర్కొన్నారు. ప్రధానంగా సోషలిస్ట్‌ సమాజ రూపకల్పనలో ఉత్పత్తిదారులైన కార్మికవర్గం, ప్రజల నిర్ణయాలే కీలకం. పాత వైరుధ్యాలు, సామాజిక అసమానతలను పరిష్కరించడం, ఉత్పాదక యూనిట్లు, సామాజిక, పరిపాలనా సేవలు, అన్ని అధికార సంస్థల నిర్వహణను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి పునాది. సోషలిస్ట్‌ సమాజం అభివృద్ధి చెందిన కమ్యూనిజంవైపు అడుగులు వేయడానికి, వైరుధ్యాలను అధిగమించడానికి, పాతదాన్ని విడిచిపెట్టడానికి కొత్త ఉత్పత్తి సంబంధాలను అభివృద్ధి చేయడానికి సహాయపడడం తక్షణ కర్తవ్యంగా ఈ మహాసభ పేర్కొంది.
ఈ సందర్భంగా జరిగిన చర్యల్లో ప్రధానంగా సోషలిజం కూలిపోవడానికి గల కారణాలతో సహా వివిధ ప్రశ్నలపై చర్చలు జరిగాయి. ‘‘సోషలిజం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి తీర్మానాలు చేయడానికి, పార్టీ19వ కాంగ్రెస్‌లో సమకాలీన విప్లవాత్మక వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, పార్టీ విప్లవాత్మక లక్షణాల పునరుద్ధరణకు సంబంధించిన సుదీర్ఘ మార్గాన్ని అనుసరించడానికి మేము ఆశావాదంగా ఉన్నామని హాజరైన యువత పేర్కొంది. నూతన తరం మాత్రం యుద్ధాల వ్యవస్థతో తాము రాజీపడమని నిష్కర్షగా ప్రతినబూనింది. దోపిడీ, అణచివేత, పేదరికం లేని ప్రపంచం కోసం తాము పోరాడతామని ప్రకటించింది. సోషలిజం కూలదోయడానికి గల కారణాలతో సహా వివిధ ప్రశ్నలకు కేకేఈ ప్రతిస్పందించింది. 1980లలో ఉద్యమించిన గ్లాస్‌నాస్ట్‌, పెరెస్ట్రోయికాలను విప్లవాత్మక శక్తులుగా వ్యక్తపరిచింది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజలకు యుద్ధం, పేదరికాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఉక్రెయిన్‌లో మూడు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం, అలాగే మధ్యప్రాచ్యం, సూడాన్‌, లిబియా, కాశ్మీర్‌, పసిఫిక్‌, ఆర్కిటిక్‌, ఇతర ప్రాంతాలలో మరిన్ని ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ యుద్ధాలు పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలను తీర్చడానికి కొద్దిమందిచే నిర్దేశించబడుతున్నాయి! తత్ఫలితంగా మౌలిక సదుపాయాల నాశనం, నిర్మూలన, శరణార్థులు, అధిక ధరలు దీనికి పరిహారమని 34వ మహాసభ నిర్వచించింది.
ఇటీవలి దశాబ్దాలలో ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తుల సహసంబంధంలో గణనీయమైన మార్పును మనం చూశాము. అంతర్జాతీయ స్థాయిలో సామ్రాజ్యవాద దేశమైన అమెరికా, నాటో, ఈయూ కూటమి దీనికి అధిపత్యం వహిస్తున్నాయి. 25 సంవత్సరాల క్రితం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మూడిరట ఒక వంతు కంటే తక్కువ విలువ కలిగిన చైనా, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో బిలియనీర్లను ఉత్పత్తి చేసే బలమైన దేశంగా నమోదైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అసమానంగా అభివృద్ధి చెందడమే దీనికి కారణం. పెట్టుబడిదారీ విధానంలోని ఈ అసమాన అభివృద్ధి అంతర్జాతీయ సామ్రాజ్యవాద వ్యవస్థలో మార్పులకు దారితీసింది. స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైరుధ్యాలను తీవ్రతరం చేసింది. ఈ వైరుధ్యాలను రాజకీయ మార్గాల ద్వారా పరిష్కరించకపోతే, అవి యుద్ధాలకు దారితీస్తాయని 34వ గ్రీస్‌ కమ్యూనిస్టుపార్టీ మహాసభ పేర్కొంది. నాటో, ఈయూ సభ్య దేశాలలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సైనిక ప్రయోజనాల కోసం ఖర్చు పెరుగుతోంది. ఇది కొత్త కార్మిక వ్యతిరేక చర్యలను కూడా తీసుకువస్త్తోంది, గ్రీస్‌, ఈయూ దేశాలలో 13 గంటల పని దినాల్ని నిర్ణయించే ప్రయత్నం ద్వారా ఇది రుజువు అవుతుంది. వారానికి ఆరు రోజులు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పని చేయడం, ఇది ఏదైనా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నమే.
ఈ విపత్కర పరిస్థితుల్లో నేటి ప్రపంచం గందరగోళంలో ఉంది. సంక్షోభాలు, ప్రతిష్టంభనలతో కూరుకుపోయింది. పెట్టుబడిదారుల గరిష్ట లాభం కోసం యుద్ధాలు, నేరాలు, దోపిడీ, అన్యాయానికి దారితీస్తుంది. ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను కూలదోయడం, సోషలిజం కోసం పోరాడటం తమ కర్తవ్యంగా గ్రీస్‌ కమ్యూనిస్టుపార్టీ ప్రతిపాదించింది. గ్రీస్‌లో నిజమైన కార్మికుల, ప్రజల శక్తి ప్రభుత్వం. ఇది మనిషిని మనిషి దోపిడీ చేయకుండా, సోషలిజం-కమ్యూనిజంతో కొత్త సమాజాన్ని నిర్మిస్తుంది. ఈ సమాజం కోసం, మన పోరాటం విలువైనదే! మనం ఈ మార్గంలో మరింత దృఢ సంకల్పంతో కొనసాగుతాము!
(ఐడీ కమ్యూనిజం నుంచి)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు