Tuesday, February 10, 2026
Homeవిశ్లేషణప్రైవేటు పెట్టుబడులతో వైద్యం భారం

ప్రైవేటు పెట్టుబడులతో వైద్యం భారం

- Advertisement -

టి.ఎన్‌.అశోక్‌

ఆరోగ్య రంగంలో ప్రైవేటు పెట్టుబడులతె వైద్యం ప్రజలకు తీవ్రమైన భారం అవుతోంది. అమెరికా, ఇండియాలో ప్రైవేటు ఆరోగ్య పరిశ్రమలు, ఆస్పత్రులు అపారంగా లాభాలు పొందుతుండగా ప్రజలకు వైద్య చికిత్స తీవ్ర భారం అవుతోంది. ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారు. ఆస్పత్రుల్లో ప్రైవేటు పెట్టుబడులు పెట్టడం ద్వారా వేల కోట్ల లాభాలు పొందుతున్నారు. గత దశాబ్ది కాలంలో అమెరికా ఆరోగ్య రంగంలో ఒక ట్రిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులపై అపార లాభాలు సంపాదిస్తున్నారు. ఇండియాలో దేశీయంగా ఇతర దేశాలలో ఈక్విటీ పెట్టుబడులు, వెంచర్‌ పెట్టుబడులు పెట్టి ఆరోగ్య రంగంలో అవసరమైన సిస్టమ్స్‌ కొనుగోలు, ఆస్పత్రులలో పెట్టుబడులకు గతంలో రెండు బిలియన్లు డాలర్లు ఖర్చు చేయగా ఇప్పటి వరకు 5.3 బిలియన్లకు ఊహించలేనంతగా పెరిగాయి. ఆస్పత్రులలో ఆరోగ్య రక్షణ కోసమా! లేక అధిక వ్యయాన్ని కొనసాగించి అపార లాభాలు పొందడానికా? ఈక్విటీ పెట్టుబడులు. అమెరికాలో లియోనార్డ్‌ గ్రీన్‌ అండ్‌ భాగస్వాములయిన ఆస్పత్రులు అప్పులతో కుంగిపోయి మూసివేశారు. పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, మసాచెసెట్స్‌లలో ఆస్పత్రులను మూసివేశారు. కేవలం మూడేళ్లు గడువుతో ప్రైవేటు పెట్టుబడులు పెట్టి అపార లాభాలు కావాలని కోరుకుంటున్నారు. బాగా రుణాలు ఉన్న ఆస్సత్రులలో పెట్టుబడులు పెట్టడం లేదా వాటిని స్వాధీనం చేసుకోవటం జరుగుతోంది. భారీగా డివిడెండ్లు పొందటం, లీజుకు తీసుకోవటం జరుగుతోంది. కొన్ని సమయాల్లో లీజుకు ఇవ్వడం కాకుండా విక్రయించడం కూడా జరుగుతోంది. ఆర్థిక స్థిరత్వం లేక దివాలా పెట్టడం జరుగుతోంది. అయితే కొన్ని ఆస్పత్రులు 1.4 బిలియన్‌ డాలర్లు డివిడెండ్‌ రూపంలో తీసుకుని దివాలా పెడుతున్నాయి.
2023 లో జెఎఎంఏ/ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫండ్‌ (జాతీయ ఆరోగ్య నిధి సంస్థలు తమ అధ్యయనంలో 25 శాతానికి పైగా ఆస్పత్రులు దివాలా తీసే పరిస్థితులకు చేరుకున్నాయి. ప్రధానంగా ఇన్ఫెక్షన్‌ల తదితర వ్యాధులకు చికిత్స చేసే ఆస్పత్రులు ఇవి. వీటిలో యువకులు, తక్కువ ఆదాయం ఉన్నవారు అననుకూల పరిస్థితుల్లో ఉన్నవారు చికిత్సలు చేయించుకుని డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆస్పత్రులు కూలిపోతున్నాయి. ఆరోగ్య రక్షణ, కావలసినంత మంది సిబ్బంది లేకపోవటం దివాలా తీయడానికి ఒక కారణమవుతోంది. అమెరికా సెనెట్‌ బడ్జెట్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ అంశాలను తెలిపింది. భద్రత లేని భవనాలను తీసుకొని అది కూలిపోవటంతో మరింతగా అప్పులకు లోనై దివాలా ప్రకటిస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడులు పెట్టి యాజమాన్యం హక్కును పొందిన ఆస్పత్రులలో రోగులు ఎక్కువమంది చనిపోవడము పెరిగింది.ఈ పరిస్థతులలో పోటీ తగ్గింది. దీనితో ప్రైవేటు పెట్లుబడులు పెట్టిన యాజమాన్యం సిబ్బందిని తగ్గిప్తోంది. కొన్ని ఆస్పత్రులలో గుండె పోటుతో ఎక్కువ మంది మరణిస్తున్నారు. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులు తగ్గిపోవంతో ఆదాయం తగ్గినపుడు పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. హెల్త్‌ ఎఫైర్స్‌ సంస్థ విశ్లేషణ ప్రకారం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించే యాజమాన్యం చికిత్స పొందిన రోగుల నుంచి తక్కువ ఫీజులు వసూలు చేయటం, దీంతో ఆదాయం తగ్గిపోయి అప్పులు చెల్లించలేక కోర్టుల్లో దివాలా పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే తరుచుగా రోగులకు ఆరోగ్య సేవలు అందించి ఎక్కువ డబ్బులతో బిల్లులు వేస్తున్నారు. అలాగే కొన్ని ప్రైవేటు పెట్టుబడులు పెట్టిన ఆస్పత్రులు 5 శాతం సిబ్బందిని తొలగిస్తున్నారు. రోగులు చికిత్స పొందే పడకలను తగ్గిస్తున్నారు. ఈ అంశాలను ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు గుర్తిస్తున్నాయి.
ఇండియాలో 2021 2024 మధ్య కాలంలో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు దేశ ఆరోగ్య భద్రతకు పెట్టిన ఖర్చు దాదాపు ప్రతి సంవత్సరం రెండు బిలియన్‌ డాలర్ల నుంచి 5.3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ విధంగా ఆస్పత్రులు ప్రయోజనాలు పొందడం వేగంగా జరిగింది. ఉదాహరణకి మణిపాల్‌ ఆరోగ్య సంస్థలు (29 ఆస్పత్రులు 8,300 పడకలు ) 59 శాతం లాభాలు పొందాయి. బ్లాక్‌ స్టోన్‌ ఆరోగ్య సంస్థ కేర్‌ ఆస్పత్రులు, కేరళకు చెందిన కిమ్స్‌ ఆస్పత్రులు 8,300 డాలర్లు వ్యయం చేస్తున్నాయి. జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థ ఉజాలా ఆరోగ్య భద్రత ఆస్పత్రులను కొనుగోలు కొని ఆస్పత్రులలో పడకలను పెంచటం ద్వారా లాభాలు పొందుతున్నాయి. అత్యధిక సర్జికల్‌ సదుపాయాలను ,రోబోటిక్‌ సిస్టమ్లను, అంకాలజీ, కళ్ల ఆరోగ్య భద్రత మాత్రమే చికిత్సలు అందించే ఆస్పత్రులకు ప్రైవేటు పెట్టుబడులు కూడా పెడుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో తక్కువ వ్యయంతో చికిత్స అందిస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ ఆస్పత్రులలో రోజుకు ఐసీయూకి రూ.1500 లు వసూలు చేస్తుండగా ఇదే ప్రైవేటు ఆస్పత్రులలో రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. ఒపెన్‌ హార్ట్‌ సర్జరీకి ప్రభుత్వ ఆస్పత్రులలో రూ.95 వేలు వసూలు చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రులలో 2 లక్షల 80 వేలు వసూలు చేస్తున్నారు. అలాగే కేన్సర్‌ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులలో 93 వేల 300 బిల్లు వేస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలలో 22 వేల 500 తీసుకుంటు న్నారు. 2019` 20 నుంచి 60 శాతం వరకు రీఇంబర్స్‌మెంట్‌ ప్రభుత్వం లేదా ఇన్స్యూరెన్సు కంపెనీలు చెల్లించే ఆస్పత్రులలోను చికిత్సలకు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనివలన వివిధ రకాల చికిత్సలకు చేసే వ్యయం అపారంగా ప్రజలకు భారమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు