Homeఫాసిస్టు దేశమేఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ లక్ష్యం

ఫాసిస్టు దేశమేఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ లక్ష్యం

- Advertisement -

. ఓటు హక్కుకు భరోసానివ్వడంలో ఈసీ విఫలం
. వామపక్షాల ఐక్యతతోనే కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

అలప్పుజా: వామపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తేనే కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం కాగల దని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వక్కాణించారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఏ విధంగా బలం చేకూర్చాలన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవడం వామపక్షాలకు అత్యవసర మని సూచించారు. వామపక్షాల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. వామపక్షాలన్నీ ఒక్కటైతేనే కమ్యూనిస్టు ఉద్యమానికి బలమన్నారు. రాజా బుధవారం కేరళలోని అలప్పుజాలో సీపీఐ రాష్ట్ర మహాసభలను ప్రారంభించారు. ‘మతతత్వ శక్తుల నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం. అన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి, వారికి ఆదర్శంగా, మార్గదర్శకులుగా మనం ఉండాలి. కమ్యూనిస్టు విలువలు, నైతికతకు కట్టుబడాలి’ అని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక స్థితి బాగోలేదని, జీఎస్టీ వ్యవస్థలో మార్పులు తప్పలేదని అన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను ప్రస్తావిస్తూ ఓటు హక్కు హరణకు కుట్రలు జరుగుతున్నాయని రాజా విమర్శించారు. ఓటు హక్కుకు హామీ ఇవ్వడంలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందని అన్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరపటం లేదన్నారు. బీహార్‌లో అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని, ఇలా ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చన్నారు. ‘ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగబద్ధ సంస్థ. అది తటస్థంగా ఉండాలి. ప్రజల ఓటు హక్కుకు హామీ ఇవ్వడం దాని కర్తవ్యమం. కానీ దురదృష్టవశాత్తు దేశంలో భిన్నపరిస్థితి ఉంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది’ అని రాజా వ్యాఖ్యానించారు. ‘మతవాద శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు శక్తి. బీజేపీ దానికి రాజకీయ విభాగం. ఇవి దేశాన్ని ఫాసిస్టు రాజ్యంగా మార్చేందుకు యత్నిస్తున్నాయి. దేశ స్వభావాన్ని మార్చివేసి దానిని మతాధారితంగా చేయాలని ప్రయత్నిస్తున్నాయి’ అని అన్నారు. నిరంకుశ బీజేపీని గద్దె దించడం ద్వారానే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశ స్వభావాన్ని కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. ఒక దేశం ఒకే ఎన్నిక అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం నుంచి వచ్చిన ఆలోచన అని రాజా విమర్శించారు. దేశ బహుళత్వాన్ని, భిన్న సంస్కృతులు, ఆచారాలు, భాషలను ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ గుర్తించవని, ఏకరూప భారతానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజాస్వామ్య నిర్మాణాలను కూల్చివేయాలని కోరుకుంటున్నాయని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని, బీజేపీని గద్దె దించేందుకు అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని రాజా పిలుపునిచ్చారు. మితవాద, ఫాసిస్ట్‌ శక్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం కోసం వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారికి ఆదర్శంగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కమ్యూనిస్టు విలువలు, నైతికతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలకు సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు కె.నారాయణ, వినయ్‌ విశ్వం (సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి), రామకృష్ణా పాండా, కార్యవర్గ సభ్యులు కె.ప్రకాశ్‌ బాబు, పి.సంతోశ్‌ కుమార్‌, కేపీ రాజేంద్రన్‌, సీనియర్‌ నాయకులు పన్నియన్‌ రవీంద్రన్‌తో పాటు ప్రత్యేక ఆహుతులు 39 మంది సహా 528 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభలను పురస్కరించుకొని పార్టీ యూట్యూబ్‌ ఛానల్‌ ‘కనల్‌’ను కె.నారాయణ ఆవిష్కరించారు. కాగా, ప్రతినిధులు కేరళ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. పోరాటాల భవిష్యత్‌ కార్యాచరణపై తీర్మానాలు చేస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు