Wednesday, January 21, 2026
Homeవిశ్లేషణబీహార్‌లో మోదీకి మహిళా స్పందన కరువు

బీహార్‌లో మోదీకి మహిళా స్పందన కరువు

- Advertisement -

అరుణ్‌శ్రీవత్సవ
బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీకి మహిళల నుంచి పెద్దగా స్పందనలేదు. ఎన్ని విన్యాసాలు, చమత్కారాలు ప్రదర్శించినా అవి మహిళలను ఆకట్టుకోలేదు. బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసిన ఎన్డీఏ లక్ష్యం నెరవేరే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఎన్నికల కమిషన్‌ సహకరిస్తుందన్న అంశాలు మెండుగా ఉన్నాయి. ఇండియా ఐక్య సంఘటన ప్రచార సభలకు పేదలు, మధ్యతరగతి, మహిళలు పోటెత్తారని వార్తలు అందాయి. పట్నాలో జరిగిన సభలో మోదీ తల్లిని రాహుల్‌ అవమానించారని ప్రధాని అబద్దాలను ప్రచారం చేశారు. అయితే ఎన్డీఏకి చెందిన వ్యక్తే మోదీ తల్లిని అవమానించారని తేలడంతో పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అయినప్పటికీ మోదీ, బీజేపీ నాయకులు అబద్దాలు ప్రచారం చేయడం మానుకోలేదు. మోదీ తల్లి హిరాబెన్‌ను అవమానించారనడంపై ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో బీహార్‌ మహిళల నుంచి ఏమాత్రం సానుభూతి కనిపించలేదు. అవకాశం గల ప్రతి సందర్భంలో, ప్రతి అంశాన్ని ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మోదీ ఉపయోగించారు. తల్లి పేరు చెప్పి ఏడ్చే ఏడ్పులను జనం పట్టించుకోవడం లేదు. మోదీ తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ విశ్వసించడం లేదు. తల్లి పేరుచెప్పి ఓట్లు కొల్లగొట్టడానికి వేసే ఎత్తుగడలు ఎంత మాత్రం ఫలిస్తాయో తెలియదు.
మోదీ ఎంతో చాతుర్యంగా, ఎక్కువ సమయం మాట్లాడి ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. తల్లే మన ప్రపంచమంటూ తన తల్లిని రాహుల్‌ అవమానించారంటూ ప్రతి సభలో చెప్పి ఆకర్షించాలన్న ప్రయత్నం ఫలించలేదు. అవినీతికి పాల్పడ్డారని ఆర్‌జేడీపై చేసిన వ్యాఖ్యలను సభల్లో పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా దేశంలో తల్లులను, అక్కాచెల్లెళ్లను , కుమార్తెలను సైతం అవమానించినప్పటికీ, అవకాశం కలిగినప్పుడు మహిళలను పొగుడుతున్నారు. తల్లిని అవమానించినం దుకు ఎంతో బాధపడ్డానన్నారు. బీహార్‌ ప్రజలు ప్రత్యేకించి మహిళలు బాధపడుతున్నారని చెప్పి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమితాబచ్చన్‌ నటించిన ఒక సినిమాలో ‘మీకు ప్రపంచం ఉంది, నాకు తల్లి ఉంది’ అని అంటారు. ఈ వ్యాఖ్యానాన్ని మోదీ ప్రచారంలో ప్రస్తావించారు. ఈ డైలాగ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఇండియా ఐక్య సంఘటన ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా సాగించిన ప్రచారం రాష్ట్ర ప్రజలను ఎక్కువగా ఆకర్షించింది. వీరికి సామూహికంగా ప్రజలు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను గమనించి మోదీ వెన్నులో వణుకు పుడుతోందని చెప్తున్నారు. మోదీ ఎత్తుగడలను గ్రామాల్లో దళితులు, పేదలు బాగా గ్రహించారు. తమకు ఓటమి తప్పదేమో నన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దళితులు, పేదలు తిరుగుబాటు చేసేలాగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ వైఖరిని నిరసిస్తున్నారు. బీహార్‌లో మోదీ పట్ల ఆకర్షణ గణనీయంగా కోల్పోయారు. రోడ్డు షోలలోనూ మోదీకి పెద్దగా స్పందన లేకపోవడాన్ని కూడా గ్రహించాలి. పట్నాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలు గతంలోవలేె లేరు. మోదీని అంతగా విశ్వసించడం లేదు. రాహుల్‌ తదితర మిత్రపక్షాల 13 రోజుల యాత్ర దిగ్విజయం అయింది.
మోదీ తల్లిని అవమానించారని బీజేపీ ఐదు గంటల బంద్‌కు ఇచ్చిన పిలుపునకు పెద్దగా స్పందన లేదు. ఈ సందర్భంగా మోదీ పర్యటించినప్పుడు కూడా ప్రజా స్పందన అల్పంగా ఉంది. మోదీ పర్యటనను విజయవంతం చేయడానికి సెప్టెంబరు 4 న బంద్‌ పిలుపునిచ్చారు. బీహార్‌లో తల్లులంతా మోదీ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోలేదని చెప్తున్నారు. మోదీ తల్లి హీరాబెన్‌ పట్ల కూడా ప్రేమాభిమానాలను వెల్లడిరచలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సైతం బీహార్‌లో మద్దతును గణనీయంగా కోల్పోయారు. ఎస్‌ఐఆర్‌ను ఉపయోగించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందవచ్చు నని ఆశిస్తూ మోదీ`షా ఎన్నికల కమిషన్‌ను ఆకట్టుకు న్నప్పటికీ గెలుపు సందేహామేనని భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ 56 లక్షల మందికి ఓట్లు లేకుండా ఓటర్ల జాబితాను తయారుచేసింది. 12 రకాల ఆధారాల పత్రాలు అందిస్తేనే ఓట్లు ఉంటాయని ఎన్నికల కమిషన్‌ అనేక షరతులు పెట్టింది. చివరకు సుప్రీంకోర్టు ఆధార్‌ కార్డును చూపించి ఓటు వేయడానికి అనుమతించి తీరాలని ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటిస్తుందా? అన్న సందేహాలు ఇంకా ఉన్నాయి. దళితులు, శ్రామికులు, మైనారిటీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినట్లు ఎన్నికల సీజన్లలో అంచనావేసే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కార్పొరేట్‌ మీడియా, గోదీ మీడియా రాహుల్‌ వ్యతిరేక అభిప్రాయం కలిగి ఉంటూ రాహుల్‌ వెనుకబడి ఉన్నారని చెప్తున్నారు. ఇటీవల ఇంగ్లీషు టెలివిజన్‌ సర్వే రాహుల్‌కు 25 శాతం ఓట్లు వస్తాయని, మోదీకి 52 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అయితే తాజాగా 13 రోజులు రాహుల్‌, ఇండియా ఐక్య సంఘటనలోని మిత్ర పక్షాలు కలిసి జరిపిన ఎన్నికల ప్రజాయాత్ర ఊహించినదాని కంటే ఎక్కువగా దిగ్విజయమైంది. మోదీ కంటే ఎక్కువగా ప్రజానాయకుడుగా రాహుల్‌ ఎదిగారని ప్రజలు ప్రశంసిస్తున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు 2 వేల మందికి పైగా మైనారిటీలను హత్య చేసిన దుర్మార్గ సంఘటన బీహార్‌లో ఇప్పటికీ ఎక్కువగా చెప్పుకుంటున్నారు. హిందూ నాయకుడి పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిరది. రాహుల్‌ అధికారానికి రావడానికీ శ్రద్ధ వహించక, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు ప్రజలలో గతంలో ఏనాడు లేనంతగా బీహార్‌లో ఆదరణ ఏర్పడిరది. ఈసారి బీహార్‌లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్థానంలో ఇండియా బ్లాక్‌ను గెలిపించి అధికారాన్ని అప్పగించే అవకాశాలున్నాయని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు నూతన ఉత్తేజాన్ని ప్రజలు అందిస్తున్నారు. రాహుల్‌ నిజంగా సెక్యులర్‌ భావజాలాన్ని, వామపక్ష భావజాలాన్ని అనుసరిస్తున్నారా అని అనిపిస్తున్నది. ప్రజానుకూల చర్యలను కాంగ్రెస్‌ తప్పక తీసుకుంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ముస్లింలు, దళిత గ్రూపులు ఆర్జేడీ నుంచి కాంగ్రెస్‌కు మళ్లుతున్నారని కూడా భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు