Homeఆంధ్రప్రదేశ్బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ

బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ

- Advertisement -

. విజయవాడ ధర్నాలో ఫ్యాప్టో ప్రకటన
. బకాయిల చెల్లింపు, 30 శాతం మధ్యంతర భృతి
. పీఆర్సీ ఏర్పాటు వేయాలని డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న బోధనేతర, విద్యాశక్తి కార్యక్రమాల్ని బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) వెల్లడిరచింది. విజయవాడ ధర్నా చౌక్‌లో మంగళవారం ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ధర్నా నిర్వహించింది. ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ అధ్యక్షత వహించిన సభలో ఫ్యాప్టో నేతలు ప్రసంగించారు. ఉపాధ్యా యుల పెండిరగ్‌ బకాయిలు, 12వ పీఆర్సీ, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ వెంటనే అమలు చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలను, సరెండర్‌ లీవులు వెంటనే విడుదల చేయాలని నేతలు నినదించారు. సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ… విద్యారంగంలో బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉపాధ్యాయులపై తీవ్రభారం పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానం రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 అమలు చేసి 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఎస్‌.చిరంజీవి మాట్లాడుతూ బోధ నేతర కార్యక్రమాలను, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ధర్నా వేదికగా ప్రకటించారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, 1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సీ వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. ఫ్యాప్టో తరపున ప్రభుత్వానికి నోటీస్‌ ఇచ్చిన 20 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెండిరగ్‌లో ఉన్న 4 డీఏలను ప్రకటించాలన్నారు. దొడ్డి దారి బదిలీలు చేయడం అసమంజసమని, అది న్యాయబద్ధ కౌన్సిలింగ్‌ విధానానికి తూట్లు పొడవడమేనన్నారు. ఉపాధ్యాయుల నియామకం చేపట్టి హైస్కూల్‌ ప్లస్‌లను బలోపేతం చేయాలని,గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు సొసైటీలకు 62 సంవత్సరాలకుగాను పదవీ విరమణ వయస్సు పెంచాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఫ్యాప్టో కో`చైర్మన్లు కె.నరహరి, బి.మనోజ్‌ కుమార్‌, సీహెచ్‌. వెంకటేశ్వర్లు, కె.ప్రకాశ్‌ రావు, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.భానుమూర్తి, జి.శ్రీనివాసరావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కార్యదర్శి ఎం.ప్రవీణ్‌ కిరణ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.రఘునాథరెడ్డి, సిహెచ్‌మంజుల, జి.హృదయ రాజు, సీహెచ్‌.రమేశ్‌, ఎం.బాబు రాజేంద్రప్రసాద్‌, సీహెచ్‌ రవి, పి.నరోత్తమరెడ్డి, బీ కరిముల్లారావు చౌదరి, ఉభయగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు బి.గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, కేఎస్‌.లక్ష్మణరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏపీ సీపీఎస్‌ఇఏ బాధ్యులు సీఎం దాస్‌, సతీశ్‌, బాజీ పఠాన్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు