ముంబయిః సాంస్కృతిక దిగ్గజం బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, తమ కొత్త కాంపైన్ ‘ద వన్ అండ్ ఓన్లీ’ని ఆవిష్కరించింది. నేటి ప్రపంచంలో, విజయం కోసం పోటీయుత రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో బ్రాండ్ శాశ్వతమైన నిజాన్ని పునరుద్ఘాటించింది. అందుకే కొత్త కాంపైన్ ఈ స్ఫూర్తిని గ్రహించింది. ముగ్గురు నాయకులు అవంతి నాగ్ రథ్, కిరణ్ దీప్ చహల్, మహికా శర్మలతొ ఈ ప్రచారం రూపొందింది. ప్రతి ఒక్కరు బ్రాండ్ భిన్నమైన రూపాన్ని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్, ప్రముఖ దినపత్రికల్లో ముందు పేజీలో ప్రకటనలు, ప్రధాన నగరాల్లో ప్రభావితపరిచే అవుట్ డోర్ సైట్స్ సహా డిజిటల్, సోషల్ ప్లాట్ ఫాంలలో 360- డిగ్రీల సమీకృత కాంపైన్ ప్రారంభమైంది. బ్రాండ్ సాంస్కృతిక నాయకత్వం విస్తృతంగా కనిపించడం ప్రోత్సహిస్తోందని పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్ దేబాశ్రీ దాస్ గుప్తా తెలిపారు.


