విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల(మార్చి2026) షెడ్యూలును రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలతోపాటు ఓఎసఎస్సీ(ఎసఎస్సీ), ఒకేషషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూలును అధికారికంగా మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభమై…ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. మెజార్టీ ప్రధాన పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూలు ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్`ఏ) పరీక్షలు జరుగుతాయి. 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 23న గణితం, 25న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించేలా బోర్డు ఏర్పాటు చేసింది. మార్చి 31న ఫస్టు లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్) పరీక్ష నిర్వహిస్తారు. ఓఎసఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 1వ తేదీన ఓఎసఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర2తోపాటు ఎసఎస్సీ ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్షలతో పబ్లిక్ పరీక్షల ప్రక్రియ ముగియనుంది. పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. అకడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎసఎస్సీ, ఓఎసఎస్సీ విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్షల షెడ్యూలు రాష్ట్ర ప్రభుత్వ సెలవుల జాబితా 2026కు లోబడి ఉంటుంది. పరీక్ష సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్నపత్రాన్నే అడిగి తీసుకోవాలని బోర్డు హెచ్చరించింది. పొరపాటున తప్ప్పుడు ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తే…వారి ఫలితాలు రద్దు చేసే అవకాశం ఉంటుందని, ఆ బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తేల్చిచెప్పారు. షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు అధికారికంగా ధ్రువీకరించారు. విద్యార్థులు తమ నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు విద్యార్థులు సమాయత్తం కావడానికి వీలుగా ప్రభుత్వం ముండుగానే టైమ్ టేబుల్ ప్రకటించింది.
మార్చి 16 నుంచిపది పరీక్షలు
- Advertisement -
RELATED ARTICLES


