హైదరాబాదః మిరప రైతులు బ్లాక్ త్రిప్స్ తీవ్రమైన ముట్టడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది దిగుబడి తగ్గించి, నాణ్యత నష్టాలకు దారితీసేందుకు కారణమవుతుంది. ఒకే విధమైన చర్యతో పురుగుమందులను పదేపదే ఉపయోగించడం ద్వారా పేలవమైన నియంత్రణ లభిస్తుండగా, మిరపలో పురుగుమందుల అవశేషాల స్థాయి పెరుగుతోంది. కొర్టేవా అగ్రిసైన్స్ ఈ సవాలును చురుకుగా పరిష్కరిస్తోంది. స్థిరమైన ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు సైంటిఫిక్ ఆధారిత, ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ (ఐపీbం) వ్యూహాల ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఉద్యానవన శాఖ అధికారులకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు ఈ సమస్య తీవ్రతను మరింత తెలియజేస్తోంది. మంత్రి నల్ల తామర పురుగు ముట్టడిపై తక్షణమే నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. తెగులు నిర్వహణ పద్ధతులపై, ముఖ్యంగా పురుగుమందుల సుర¿ాìతంగా, ప్రభావవంతమైన వాడకంపై రైతులకు మార్గనిర్దేశం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కొర్టేవా అగ్రిసైన్స్ ఈ సంక్షోభానికి ఐదు కీలకమైన మోడల్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా స్పందించింది.


