రోగర్ డి హారిస్, జాన్ పెర్రి
రెండోసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గత ఆరునెలల కాలంలో ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేస్తున్నారు. ఆయన మాటలే అంతంకాని యుద్ధంగా తయారయ్యాయి. మరోవిధంగా చెప్పాలంటే ఇది నూతన ప్రచ్ఛన్నయుద్ధం. అంతంలేని యుద్ధంలోకి ప్రస్తుతం ప్రపంచం ప్రవేశిస్తున్నది. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలను ట్రంప్ లక్ష్యంగాపెట్టుకున్నారు. ఈదేశాల వద్ద ఆయుధాలు లేవు. ట్రంప్ వద్ద కావలసినన్ని ఆయుధాలు ఉన్నాయి. లాటిన్ అమెరికా దేశాలైన క్యూబా, వెనిజులా, నికరాగ్వా, బొలీవియా తదితర దేశాలను సుంకాలతో బెదిరిస్తున్నాడు. ఈ దేశాలపైన ఆంక్షలు, సుంకాలు విధించడం, ఈ దేశాలనుంచి అమెరికా వచ్చి జీవిస్తున్నవారిని ఆయా దేశాలకు తిరిగి పంపించడం పైన పేర్కొన్నదేశాలకు తీవ్రమైన బాంబుల్లాగా ఉన్నాయి. క్యూబా, వెనిజులా, నికరాగ్వా, బొలీవియా తదితర లాటిన్ అమెరికా దేశాలపైన ట్రంప్ రకరకాల దాడులు సాగిస్తున్నారు. కొన్ని పశ్చిమదేశాలలో వామపక్షాలు, ఈ దేశాలను రక్షించేందుకు తగిన చర్యలను తీసుకుంటున్నారు. ఈ దేశాలలో ప్రభుత్వాలను మార్చివేసేందుకు వివిధ పథకాలను కూడా రూపొందిస్తున్నారు. ఈ విధంగా ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్న అంశం మంచి ఉదాహరణే. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసినతర్వాత అధ్యక్షులైన వారంతా అమెరికాకు అసాధారణమైన ముప్పుగా పరిణమించారు.
చరిత్రకారులు ఇసాక్ సాని ఇలాచెప్పారు. క్యూబా అసాధారణమైన విప్లవశక్తిగా పొరపాటు చర్యను అనుసరించలేదు. అలాగే సమాజంలో కొరతలు ఉన్నాయని ఆయుధాలు కూడాఉన్నాయని ఉన్నవి, లేనివి కలిపి ప్రచారం సాగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాటిన్ అమెరికాలో ఆర్థికరంగాన్ని అస్థిరం కావించడానికి చర్యలు తీసుకోవడం మాత్రమేకాదు… ఊపిరాడని పరిస్థితిని తెచ్చిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా, ఆంతరంగిక అసమ్మతిని, ప్రభుత్వం ప్రతిష్టపైన ప్రజలలో అపనమ్మకం కలిగించేందుకు, అంతిమంగా సమాజం సాధించిన ప్రయోజనాలను ధ్వంసంచేసేందుకు ట్రంప్ పూనుకున్నాడు. అమెరికా బహువిధ (హైబ్రిడ్) యుద్ధంతో క్యూబా తీవ్రంగా ఇబ్బందులపాలైంది. అదేసమయంలో వెనిజులా, నికరాగ్వాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ మూడు దేశాలకు సంబంధించిన కొందరు అమెరికాకు వలసలు వెళ్లారు. వీరిని తిరిగి స్వంత దేశాలకు పంపివేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నందున వారికి రక్షణ కొరవడుతుంది. వెనిజులా, నికరాగ్వా అమెరికాకు ఎగుమతిచేసే వస్తువులపైన అసాధారణమైన సుంకాలను విధించేందుకు సిద్ధపడి బెదిరిస్తున్నాడు.
ఆరు దశాబ్దాలుగా అమెరికా క్యూబాపై దిగ్బంధం విధించడంతో అక్కడ పరిస్థితి మరింత క్లిష్టతరమైంది. అయితే ఈ మూడు దేశాలు చైనాతో వాణిజ్య కూటమిగా ఏర్పడి పోరాటం చేస్తున్నాయి. ఇంకా ఇతర దేశాలతోనూ వాణిజ్య కూటమిగా మారుతున్నాయి. మెక్సికో క్యూబాకు చమురు సరఫరా చేస్తోంది. క్యూబాలో ప్రతిరోజూ విద్యుత్ కోతలను తప్పించడంకోసం చైనా సౌర పానెల్స్‌ను నెలకొల్పుతోంది. అమెరికా ఆంక్షలను ప్రతిఘటించేందుకు వెనిజులా, నికరాగ్వా దేశాలకు ఆహారభద్రతను చైనా కల్పిస్తోంది. వాషింగ్టన్ వలసలువచ్చిన వారిని తిరిగి స్వదేశాలకు పంపడమేకాకుండా ఇప్పటికే 2052 మంది జైళ్లలో ఉన్నారు. వీరిని విడుదల చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెనిజులాలో అమెరికా మద్దతుగల అతి మితవాద ప్రతిపక్షం అస్తవ్యస్తంగా ఉంది. ట్రంప్ మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు వెనిజులా తాత్కాలిక అధ్యక్షపదవిలో జుయాన్ గుయ్‌డో, అనంతరం ఎడ్మండో గుంజాలెజ్ వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు బైడెన్ పరిపాలన జరుగుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా మదురో ఉన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం గుంజాలెజ్‌ను అధ్యక్షుడిగా గుర్తించడానికి పూనుకున్నాడు. వలసదారులకు కఠినమైన శిక్ష విధించారు. నికరాగ్వా మితవాద ప్రతిపక్షం కూడా ట్రంప్ తీసుకున్న చర్యకు ఇబ్బంది పడుతోంది. లాటిన్ అమెరికాలో వామపక్షాల ప్రభుత్వాల (పింక్ టైడ్) వైపు మళ్లడం 2018లో మెక్సికోలో ప్రారంభమైంది. అనంతరం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. మెక్సికో ప్రస్తుత అధ్యక్షుడు క్లాడియా షైన్‌బామ్ బహుశ: బఫూన్ వైట్‌హౌస్‌తో భాగస్వామ్యం పొందాలని చూస్తున్నాడు. అయినప్పటికీ మెక్సికోకు సుంకాలు విధించడం, వలసకారులను తిరిగిపంపడం, సైనిక జోక్యాల ద్వారా మెక్సికోను ఇబ్బంది పెడుతున్నాడు. చిలీలో గాబ్రియల్ బోరిక్, కొలంబియాలో గుస్తావ్ పెట్రోలు వామపక్షాలవైపు మళ్లారు. అయితే ఈ ఇరువురు తీవ్రమైన తిరోగమన అధికార శక్తులుగా తయారయ్యారు.
చిలీలో కమ్యూనిస్టు అభ్యర్థి జినెట్టి జారాకు ఇప్పటికే జరిగినఅధ్యక్ష ఎన్నికల మొదటిరౌండ్‌లో సానకూల పరిస్థితి ఏర్పడిరది. నవంబరులో రెండవ రౌండ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి మితవాదులతంతా ఒక్కటై జారాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.


