తహసిల్దార్ ఏ శ్రీనివాస్
విశాలాంధ్ర – సీతానగరం: రైతుల ఖాతాలకు ఎన్ పి ఐ సి లింక్ చేయాలని బ్యాంక్ అధికారులను కోరిన తహసిల్దార్ ఏ శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు ఆర్ధిక బరోసా కల్పిస్తూ అన్నదాత సుఖీభవ పథకం నిధులను త్వరలో విడుదల చేయనున్న నేపద్యంలో పెండింగ్ లో రైతుల బ్యాంక్ ఖాతాలకు ఎన్ పి ఐ సి లింక్ త్వరితగతిన పూర్తి చేయాలని తహసిల్దార్ శ్రీనివాస్ బ్యాంకులకు తిరిగి బ్యాంక్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో 146 మంది రైతుల ఖాతాలు ఎన్ పి ఐ సి లింక్, ఇన్ యాక్టివ్ లో ఉన్నాయని అన్నారు. వీటిలో చినకొండేపూడి 20, రఘుదేవపురం 25, కాటవరం 20 ఇలా అన్ని గ్రామాలలో ఖాతాలు ఉన్నాయని అన్నారు. వీటిలో ఇప్పటివరకూ 10 మరణాలను గుర్తించడం జరిగింది ఇంకా కొన్ని మరణాలు ఉండవచ్చు అని అన్నారు. కావున రైతులు అందరూ మీ గ్రామాల పరిధిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, విఆర్ఓల ద్వారా వివరాలను తెలుసుకొని మీ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని కోరారు. అలాగే బ్యాంక్ అధికారులు వచ్చిన రైతులకు ఎన్ పి ఐ సి లింక్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


