Homeఆంధ్రప్రదేశ్సుపరిపాలనలో తొలిఅడుగు

సుపరిపాలనలో తొలిఅడుగు

- Advertisement -

కడియంలో “సుపరిపాలనలో తొలిఅడుగు” కార్యక్రమం.

— కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

–అర్హులందరికీ పింఛన్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం.

–కొత్తగా మంజూరైన పించన్ల పత్రాలు పంపిణీ.

విశాలాంధ్ర – కడియం : ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలంలో గురువారం జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో మంత్రి కొండపల్లి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్థానిక నేతలతో కలిసి మంత్రి కొండపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏడాది పాలనలో  ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటింటికి వివరించారు. ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండపల్లి ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగ కొత్తగా మంజూరైన వితంతు పింఛన్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని గత వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 అక్టోబర్ మధ్య భర్తను కోల్పోయిన వితంతు పించను కోసం వేచి చూస్తున్న మహిళలకు ఈ పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనకు కూటమి ప్రభత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు. అలానే ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో దురదృష్టకర పాలనను చూశామని, జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోయాయని తెలిపారు. అయితె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం‌ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, అప్పుల పాలు చేశారని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై దాడులకు దిగారని, విద్యంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. అలానే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాధాన్యత ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతకుముందుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన ఉత్పత్తులను మంత్రి కొండపల్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి మోసగంటి సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని, టిడిపి వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, ఎమ్మార్ పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ బోడపాటి గోపి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, యర్ర వేణుగోపాల రాయుడు, రూరల్ బిజెపి ఇంచార్జ్ ఆకుల శ్రీధర్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, ఆదిమూలం సాయిబాబా, చిలుకూరి ప్రభాకర్, గెడ్డం శివ, నాగిరెడ్డి రామకృష్ణ, జంగా వినోద్, డ్వాక్రా పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, ఎంపిడిఓ కె రమేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు