Wednesday, February 18, 2026
Homeజాతీయంవిమానం ఇంజిన్‌లో మంటలు

విమానం ఇంజిన్‌లో మంటలు

- Advertisement -

కోల్‌కతా: టర్కీకి చెందిన ఓ విమానానికి తీవ్ర సమస్య ఎదురైంది. ఖాట్మండు నుంచి టర్కీ బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన పైలట్ కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 236 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితమేనని అధికారులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం ఖాట్మండు నుంచి ఇస్తాంబుల్ బయలుదేరిన టర్కీ ఎయిర్‌లైన్స్ విమానం… గాల్లోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే కుడి వైపు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన పైలట్… వెంటనే ఆ ఇంజిన్‌ను నిలిపివేశారు. ఈ విషయాన్ని కాట్మండు టవర్‌కు చేరవేసి… పరిస్థితిని అంచనా వేస్తూ సింగిల్ ఇంజిన్‌తోనే కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు. అనంతరం సుదీర్ఘ ప్రయాణం సురక్షితం కాదని భావించి… కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పైలట్ నుంచి ‘ప్యాన్ ప్యాన’ సిగ్నల్ రాగానే నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు పౌర విమానయానశాఖ వెల్లడించింది. ‘ప్యాన్ ప్యాన’ అనేది విమానంలో అత్యవసర పరిస్థితిని సూచించే రేడియో డిస్ట్రెస్ కాల్. అయితే, ‘మేడే’ కాల్ అంత తీవ్రమైనది కాదు. గగనతలంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తినప్ప్పుడు పైలట్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ పంపిస్తారు. పరిస్థితి అత్యంత తీవ్రమైనది కానప్పటికీ… క్లిష్టమైనది అని చెప్పేందుకు ఈ మెసేజ్ ఇస్తారు. రెండు ఇంజిన్ల విమానాల్లో ఒకటి విఫలమైనప్ప్పుడు, తదితర సందర్భాల్లో ఈ సందేశం పంపిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు