Homeవ్యాపారంవెల్కమ్‌హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు

వెల్కమ్‌హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు

- Advertisement -

న్యూదిల్లీ: ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ (ఐటీసీహెచఎల్) భారతదేశంలో వెల్కమ్‌హోటల్ బ్రాండ్ కోసం 50వ హోటల్ మైలురాయి ఒప్పందాన్ని ఈరోజు ప్రకటించింది. పెరుగుతున్న ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోకు షిర్డీ మరియు భువనేశ్వర్‌లలో కొత్త హోటళ్లను చేర్చింది. వెల్కమ్‌హోటల్ బ్రాండ్ కోసం త్వరలో ప్రారంభం కానున్న గమ్యస్థానాలలో సిక్కింలోని గాంగ్‌టక్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్ ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డీలో మెస్సర్స్ శాండీ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న 73 గదుల హోటల్‌ను నిర్వహించడానికి ఐటీసీహెచఎల్ ఇటీవల వారితో ఖచ్చితమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన ఈ కొత్త ఒప్పందం, వెల్కమ్‌హోటల్ బ్రాండ్ క్రింద ఒడిశాలోని భువనేశ్వర్‌లో 84 గదులతో కూడిన రెండవ హోటల్‌ను ఏర్పాటు చేయడానికి కూడా విస్తరించింది. ఈ రెండు కొత్త ఒప్పందాలతో, వెల్కమ్‌హోటల్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో 5500కు పైగా గదులతో 51 హోటళ్లు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు