Sunday, November 16, 2025
Homeసంపాదకీయంశ్రమశక్తిని దోచుకోవడానికే!

శ్రమశక్తిని దోచుకోవడానికే!

- Advertisement -

‘శ్రమ్‌ శక్తి నితి2025’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే జాతీయ కార్మికఉపాధి విధానం ముసాయిదాను రూపొందిం చింది. ముసాయిదా విధానాన్ని చట్టంగా మార్చేముందు ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేసింది. న్యాయమైన, సమ్మిళితమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ విధాన లక్ష్యమని మోదీ ప్రభుత్వం చెపుతోంది. కాకపోతే, ఈ ముసాయిదా విధానంలోని ప్రతి పేజీలోనూ ఏదో ఒక లోపం కన్పిస్తున్నప్పుడు, సమ్మిళిత శ్రామికశక్తిని ఇదెలా సృష్టిస్తుంది? మోదీ సర్కారు యథావిధిగా పెట్టుబడిదారీ విధానానికి అనుకూల చట్టాలను తీసుకురావాలన్న కుటిల యత్నాల్లో ఇదీ ఒకటని తేలిపోయింది. పారిశ్రామికీ కరణ విస్తృతంగా జరగాలన్నది పన్‌డీఏ ప్రభుత్వ కర్తవ్యం. దాంతోపాటుగా ’ఉన్న శ్రమశక్తిని విస్తారంగా దోచుకోవడం’, ‘ఏఐ వంటి పరికరాల వాడకాన్ని పెంచడం ద్వారా అతితక్కువ మానవ వనరుల శ్రమశక్తిని ఉపయోగించు కోవడం’, ‘వీలైనంత మేరకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరమైన రాయితీలు ఇవ్వడం’… వంటి ఐచ్ఛిక అంశాలను ప్రభుత్వం తన అనుబంధ కర్తవ్యాలుగా అట్టిపెట్టుకుంది. సరిగ్గా ఈ ఉద్దేశానికి అనుగుణంగానే మోదీ ప్రభుత్వ తాజా ‘శ్రమ్‌ శక్తి నితి2025’ రూపొందింది. ఒక కోణంలో ఈ విధానం ‘తీయ’గా ఉన్నట్లు అన్పిస్తుంది. కానీ శ్రామికులను దోచుకునే రహస్య పజెండా స్పష్టంగా కన్పిస్తోంది. లోతుగా పరిశీలిస్తే, జాతీయ కార్మికఉపాధి విధానం ముసాయిదా ప్రగతిశీల లక్ష్యాలను విస్మరిస్తుంది. విమర్శకులు, ముఖ్యంగా కార్మిక సంఘాలు, విధాన విశ్లేషకులు, సామాజిక నిపుణులు ఇందులో అనేక కీలక లోపాలను గుర్తించారు. పారదర్శక ప్రక్రియలు లేకపోవడం ఈ విధానంలో ప్రధాన లోపం. నైపుణ్యత కొరవడిన కార్మికునికి పలాంటి భరోసా ఉండదు. ఒక నూతన సాంకేతిక ఆవిష్కరణ జరిగిన ప్పుడు, అది అందరికీ కొత్తదే. ఆ నైపుణ్యాన్ని సంబంధిత పరిశ్రమలో అనువర్తింపజేయాలంటే, అప్పటికే పనిచేస్తున్న కార్మికులు ఆ నైపుణ్యాన్ని పొందే అవకాశం ఇవ్వడం యాజమాన్య ప్రధాన కర్తవ్యం కావాలి. ఆ తర్వాతనే తత్సంబంధిత నిపుణుల భర్తీ జరగాలి. అందుకే ఈ తరహా కార్మికులను రక్షించడానికి తగినన్ని రక్షణలు ఈ విధానంలో లేవు. అదే విధంగా ఈ విధాన అమలు కూడా అనేక సవాళ్లతో కూడుకుని ఉంది. ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి పూర్తిగా వైదొలగడం ఇంకో లోపం. అంటే ప్రభుత్వం నుంచి కార్మికులకు పలాంటి భరోసా ఉండదని ‘శ్రమ్‌ శక్తి నితి’ స్పష్టంగా చెపుతోంది. కార్మికుల నిర్వహణ, భర్తీ తదితరాలన్నీ కార్పొరేట్‌ చేతిలోనే ఉంటాయి. పలాంటి కార్మిక హక్కులు ఉండవు. పైగా ‘శ్రమ్‌ శక్తి నితి’ రూపకల్పనకు ముందే ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు జరిపి ఉండాల్సింది. కానీ ఏకపక్ష ఉత్తర్వు తరహాలో ఈ ముసాయిదాను విడుదల చేసి కార్మిక, నిరుద్యోగ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందుకే ఏఐటీjూసీ వంటి ప్రధాన కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకించాయి. కార్మికుల సమస్య తలెత్తితే, jూనియన్లు, యజమానులతో సంప్రదింపుల ప్రామాణిక త్రైపాక్షిక ప్రక్రియ అనేది ఒకటుంటుంది. కానీ ఈ సూత్రాన్ని కొత్త విధానం ఉల్లంఘిస్తుంది. అంటే, కార్మికుడు ఏ మాత్రం మాట్లాడటానికి అవకాశమే లేదని అర్థమవుతోంది. ఈ విధానం రాజ్యాంగ, అంతర్జాతీయ చట్రాల పరిధిలో ఉన్నప్పటికీ, మనుస్మృతి వంటి పురాతన హిందూ గ్రంథాల నుంచి భావనలను ప్రేరేపిస్తున్నది. ఇది ఆధునిక భారత రాజ్యాంగంతో వైరుధ్యాన్ని సృష్టిస్తుందన్న వాదన ఉంది. రాజ్యాంగమనేది సమానత్వాన్ని హామీ ఇస్తుంది, కులం, మతం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. కానీ నూతన శ్రమశక్తి విధానం ఈ పరిధి నుంచి బయటకు నెడుతుంది.
కార్మికుల హక్కులు, శ్రేయస్సు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొని, వాటిని రాష్ట్రాలు, మార్కెట్‌కు బదిలీ చేసింది. అత్యంత బలహీనమైన కేంద్ర జవాబుదారీతనానికి ఇది నిదర్శనం. సంస్కరణలను అమలు చేయడానికి రాష్ట్రాలు ప్రత్యేక మిషన్‌లను ఏర్పాటు చేయాలని ముసాయిదా చెపుతుందంటే, దానర్థం కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నీరుగార్చి కార్మిక రక్షణలను బలహీనపర్చడమే. గిగ్‌ వర్కర్లను ఇది పూర్తిగా విస్మరించింది. ఈనాడు గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మిక రంగం విపరీతంగా విస్తరిస్తున్నది. అయినప్పటికీ, ఈ విధానంలో వారికి సంబంధించిన నిర్ధిష్ట వివరాలు లేనేలేవు. గిగ్‌ కార్మికులకు తగినంత వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యభరోసా ఇవ్వలేకపోయింది. డోర్‌ డెలివరీల ప్రాముఖ్యత పెరుగుతున్న దశలో ఆ రంగానికి ఊతమిచ్చిన గిగ్‌ వర్కర్లను పట్టించుకోకపోతే, కొత్త కార్మిక విధానమెందుకు ఉన్నట్లు? ఇది చట్టరూపం దాల్చితే, కార్మికులకు సామాజిక భద్రత ఇంకేముంటుంది? వీరి హక్కులకు చట్టబద్ధత లేకపోతే, కనీస వేతనం ఉంటుందన్న హామీ ఇవ్వలేరు. గిగ్‌ ఆర్థిక వ్యవస్థలో భద్రతా ప్రమాణాలకు స్పష్టమైన, అమలు చేయగల ఫ్రేమ్‌వర్క్‌ను అందించడంలో ముసాయిదా విఫలమైంది. సురక్షితమైన పని వాతావరణాలను నిర్ధారించడం, ఉద్యోగంలో గాయాలకు పరిహారం అందించడం లేదా మహిళా గిగ్‌ కార్మికులను వేధింపుల నుంచి రక్షించడం కోసం స్పష్టమైన సెక్షన్లు లేవు. అన్నిటికీ మించి, వలస కార్మికులకు పేలవమైన రక్షణ ఈ విధానంలోని మరో ప్రధాన లోపం. కోవిడ్‌19 మహమ్మారి సమయంలో తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికులు మళ్లీ సామాజిక వ్యవస్థ పగుళ్ల నుంచి అథఃపాతాళానికి జారిపోవచ్చు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న మాట ఉన్నప్పటికీ, దీనికి నిధులు పలా సమకూరుతాయో చెప్పగలిగే స్పష్టమైన ఆర్థిక నవూనా లేదు. వీరికి బడ్జెట్‌ వనరుల కేటాయింపు ఉంటుందన్న నమ్మకం లేదు. ‘లేబర్‌ స్టాక్‌’ వంటి డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై ఈ విధానం పక్కువగా ఆధారపడటం అసంఘటిత శ్రామిక శక్తిలో మెజారిటీ కార్మికులను ముఖ్యంగా తక్కువ డిజిటల్‌ అక్షరాస్యత, పరిమిత ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేదా సరైన గుర్తింపు లేకపోవడంతో మినహాయించవచ్చు. అలాగని డిజిటల్‌యేతర ప్రత్యామ్నాయాల ప్రస్తావనా లేదు. రాష్ట్రాల నియంత్రణకు ఈ విధానం వూల్యాంకన సూచిక అనే వ్యవస్థను ప్రతిపాదించింది. కాకపోతే, స్వతంత్ర పర్యవేక్షణ విధానాల స్పష్టత కొరవడిరది. పారదర్శక, వూడవ పక్ష ఆడిట్‌లు లేకుండా, జవాబుదారీతనం నిర్ధారించడం సవాలు కావచ్చు. ఇక అన్నిటికీ మించి, బహుళ ప్రభుత్వ డేటాబేస్‌లను ఏకీకృత వ్యవస్థలోకి అనుసంధానించే ప్రణాళికలో భాగంగా కార్మికుల డేటాను పొందుపర్చాలన్న నిబంధన వారి డేటా భద్రత, గోప్యత విషయంలో ఆందోళన కలిగించే అంశమే. సున్నితమైన కార్మికుల డేటాను పవరు నియంత్రిస్తారు? పవరు యాక్సెస్‌ చేస్తారు? లేదా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఏ రక్షణ చర్యలు అమలులో ఉంటాయనే దానిపై తగినంత స్పష్టత లేదు. పేదలు, వలసదారులను అణగదొక్కేలా పెరుగుతున్న అసమానత, అసమాన పట్టణ అభివృద్ధి వ్యూహాలు వంటి కార్మిక మార్కెట్‌లోని అంతర్లీన నిర్మాణ సమస్యలను ముసాయిదా విధానం తగినంతగా పరిష్కరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని తిరస్కరించడమే ఉత్తమం. ఇప్పటికే తీవ్ర నిరసనలు చవిచూసిన నాలుగు కార్మిక కోడ్‌లలోని వివాదాస్పద అంశాలను తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ‘శ్రమ్‌ శక్తి నితి2025’ ముసాయిదాను ఒక మార్గంగా చూస్తున్నదనే ఆరోపణలో వాస్తవముంది. ప్రభుత్వం నిజమైన శాసనసంస్కరణలకు ప్రాధాన్యతనివ్వకుండా, పంతసేపూ కార్మిక, రైతువ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల చట్టాలకే ప్రాముఖ్యతనిస్తున్నదని మరోసారి రుజువైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు