హైదరాబాద్: పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో, టాటా సంస్థకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్, సహజ రత్నాల విభాగంలో తమ తాజా ఆభరణాలను రుక్మిణి వసంత్‌తో కలిసి ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో ఎల్లప్పుడూ రత్నాలు, కేవలం అలంకరణకు మించినవి; అవి సంప్రదాయం, గుర్తింపు, నిత్యజీవితపు సొగసుకు ప్రతీకలు. టెంపుల్ జ్యువెలరీ ప్రభావం నుండి ఉత్సాహభరితమైన వేడుకల వరకూ, ఈ ప్రాంతపు సౌందర్య భాషలో లోతుగా రత్నాలు పెనవేసుకుపోయాయి. కెంపులు, పచ్చలు, ఇతర ప్రకాశవంతమైన రాళ్ల వైభవాన్ని ఒక ప్రధాన భాగంగా దక్షిణాది స్వీకరించింది. దక్షిణ భారతదేశంలో తనిష్క్ యొక్క కొత్త ముఖ చిత్రంగా రుక్మిణి వసంత్ ఆధునిక దక్షిణ భారత ఆభరణాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. సహజసిద్ధమైన సొగసు మరియు ఉల్లాసకరమైన ఆధునికతతో ‘హ్యూస’ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. వ్యక్తిత్వం, శాశ్వతమైన సౌందర్యం కలిసే తాజా కలెక్షన్ ఇది.


