Homeవిశ్లేషణసాగుకు శ్రీకారంఏరువాక మహోత్సవం

సాగుకు శ్రీకారంఏరువాక మహోత్సవం

- Advertisement -

ఏరువాక సాగారో చిన్నన్నా…నీ కష్టమంతా తీరునురో రన్నో ఓరన్నో… అంటూ వ్యవసాయానికి, ఏరువాక పౌర’మికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ రైతాంగం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనంద డోలికల్లో తేలియాడే ఓ మోత్సవమే ఏరువాక. జూన్ 29న రైతులంతా అత్యంత ఉత్సాహంగా ఏరువాక మహోత్సవం రోజు సాగుకు శ్రీకారం చుట్టడం ప్రారంభిస్తారు. పూర్వకాలంలో ఏరువాక పూర్ణిమరోజు రైతులు అరకలు కట్టి పొలం పనులు ప్రారంభిస్తారు. వరü రుతువులో తొలకరి జల్లుల ఆగమనంతో మన రైతులు ఆనందోత్సవాల మధ్య పొలం దున్ని వ్యవసాయ పనులు తొలిసారిగా ప్రారంభించే ప్రక్రియ ఈ ఏరువాక. ఆ రోజు రైతులు తమ పశువులను, వ్యవసాయ పనిముట్లను అలంకరించి నవధాన్యాలను విత్తుతారు. తమ భూములలో మంచి పంటలు పండాలని ప్రార్ధిస్తారు. భూమితో పాటు పశువులకు, వ్యవసాయ పని ముట్లకు పూజలు నిర్వహిస్తారు. తమ పొలాల్లో ఎద్దులతో నాగలి కట్టి దుక్‌కి దున్నటాన్ని “ ఏరువాక” అంటారు. ఏరు అంటే ఎద్దులను అరక కట్టి దున్నడానికి ప్రారంభ సమయమని పెద్దలు చెబుతారు. ఏరువాక రోజున నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా రైతాంగం భావిస్తారు. రైతులు ఉదయాన్నే ఎద్దులను శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కాడి, మేడి, నాగలిని పూజిస్తారు. ఎద్దులకు బొబ్బట్లు తినిపిస్తారు. సాయంకాలం ఎడ్లను అలంకరించి ఊరేగిస్తారు. పశువులు అంటువ్యాధుల బారిన పడకుండా ఆయుర్వేద మందులు, నూనెలను తాగిస్తారని పెద్దలు చెప్పేవారు. ఏరువాక పౌర’మి రైతులకు సంబంధించి ప్రాధాన్యత కలిగిన పండుగగా ప్రాచీన కాలం నుంచి మన రైతాంగం భావిస్తారు. ప్రకృతిని పూజించే పండుగగా గ్రామీణ ప్రజలు ఏరువాకకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. తొలకరి జల్లులు కురిసినప్పుడు పొలాలను దుక్కికి సిద్దం చేసుకొని సేద్యం మొదలు పెట్టే ఉత్సవాన్ని “ఏరువాక పూర్ణిమ” అంటారు. ఏరువాక పొంగి పొర్లటానికి చేసే పూజ అని కూడా అంటారు. అయితే జ్యేష్ట మాసంలో భూమిని ఎక్కువగా తవ్వటం గాని, దున్నడం గాని చేయకూడదనే నానుడి ఉన్నది. భూమి వేడెక్‌కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల భూమి నుంచి విష వాయవులు వెలువడి మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందనే నమ్మకం కూడా ఉన్నది. అందువల్ల భూమి పూజ నిర్వహించేందుకు మాత్రమే కొద్దిగా తవ్వటం లేదా అరకలతో కొండ్ర వేస్తారు. తమకున్న వ్యవసాయ భూమిని చదును చేయడం గట్టు వగైరా వంటి వాటిని రిపేర్లు చేసుకోవడం, పశువుల ఎరువు తోలి చిమ్మడం లాంటి పనులు ప్రారంభిస్తారు. పూర్తిస్థాయిలో వర్షం పడిన అనంతరం తిరిగి సేద్యపు పనులు మొదలుపెడతారు. ఏరువాక రోజున వ్యవసాయానికి వినియోగించే పశువులన్నింటిని పరిశుభ్రంగా కడుగుతారు. గిట్టలకు పసుపు వగైరా పూస్తారు. నాగళ్లతో దుక్‌కి దున్నేందుకు బండ్లు కట్టి వాటిని కష్టపెడుతున్నందుకు క్షమించి Å£రుణించమని అన్నదాతలు ఎద్దులకు పూజలు నిర్వహిస్తారు. ఆహార ధాన్యాలు పండించటంలో సహకరించాలని కష్టజీవులైన మూగజీవాలను వేడుకొంటారు. బెల్లం, బియ్యం, పాలతో పులగం వండి పశువులకు ఆహారంగా పెడతారు. గ్రామంలో పెద్దలు, పిల్లలు అందరూ చేరి ఆనందంగా పాటలు పాడుకుంటారు. సేద్యానికి అవసరమైన పనిముట్లైన నాగలి, కర్రు, గుంటక, గొర్రు, పార, ఆకురాయి వంటి వాటిని శుభ్రం చేసి పూజ చేయడం ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఏరువాక పౌర’మి సీత యజ్ఞమని, సంస్కృత భాషలో ఉదృషభ యజ్ఞం అని కన్నడంలో కారణి పబ్బం అని ఉత్సవాలుగా జరుపుతారు. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగా చేసేవారు. అధరÇణ వేదం ఏరువాకను “ అనడోత్సవం” గా చెప్పింది. నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్దతులను అనాడు ఆచరించే వారు. ఆ తరువాత కాలంలో పరాసరుడు, బోదాయనుడు మొదలైన మహర్షులు కూడా ఈ పండుగ గురించి ప్రస్తావించారు. విష్ణు పురాణంలో సీతా యజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించారు. సీత అంటే నాగలి అని అర్థం. వప్ప మంగళదివసం, బీజవాపన మంగళదివసం, వాహన పునా’మంగళం, కరüణ పుణా’మంగళం అనే పేర్లతో ఈ పండుగను వివిధ ప్రాంతాల వారు వైభ„వంగా జరుపుకునేవారు. శుద్దోదన మహారాజు అనాడు కపిల లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగళ్లను కర్షకులకు అందించినట్లు శాస్త్రాలలో వివరించారు. హాలుడు రాసిన గాధసప్తసతిలో ఏరువాక గురించి అనేక కధనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు వారు నిర్వహించే పండుగలలో సాహిత్య అధారాలున్నా వేల సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధంగా ప్రాచుర్యం పొందినది ఏరువాక పండుగ. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో కూడా ఏరువాక గురించిన ప్రస్తావన ఉన్నది. ఇంత ప్రాచుర్యం ఉన్న ఏరువాకను మన రైతు సోదరులందరూ మహోత్సవంగా జరుపుకోవాలి. సాంప్రదాయ వ్యవసాయ పద్దతులు కొనసాగిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేయాలి.
ఏరువాక మోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి : ఏరువాక మోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న వ్యవసాయ పరిస్థితులలో రైతాంగాన్ని, కౌలు రైతులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి ఏరువాక మోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి సాంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అదే విధంగా అడుగంటిపోతున్న చేతి వృత్తులను సైతం ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ వ్యవసాయాన్ని రైతాంగం కొనసాగించేలా దృష్టి సారించాలి. ఏరువాక మహోత్సవంలో రైతాంగాన్ని భాగస్వాములను చేయాలి. సాంప్రదాయ వ్యవసాయాన్ని కొనసాగించేందుకు వీలుగా పాడి పశువులతో పాటు రైతులకు ఎద్దులు, ఎడ్లబండ్లు, ఇతర పనిముట్లు 50శాతం సబ్సిడీపై అందించాలి. అధునిక వ్యవసాయంలో భాగంగా ట్రాక్టర్లు ఇతర సాంకేతిక యాంత్రీకరణలను వినియోగించాలి. వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్ల రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 50 శాతం సబ్సిడీపై డీజిల్ అందించాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన సబ్సిడీ పథకాలను సాధించి అందించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు