Saturday, May 17, 2025
Homeవిశ్లేషణసామాజిక భద్రతలేని గృహకార్మికులు

సామాజిక భద్రతలేని గృహకార్మికులు

డి. భట్టాచార్య

మనదేశంలో ఇతర కార్మికులతో సమంగా గృహ కార్మికులను చూడటంలేదు. 2011లో ఐఎల్‌ఓ సదస్సులో సి 189 చట్టం కింద గృహకార్మికులను కూడా ఇతర కార్మికులతో సమంగా చూసేందుకుగాను ఇండియా ఆమోదంతోనే తీర్మానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గృహకార్మికులు అత్యంత భారీ సంఖ్యంలో ఉన్నారు. భారతదేశంలో 25 మిలియన్ల నుంచి 80 మిలియన్ల మధ్య గృహకార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇండియాలో గృహకార్మికులకు సామాజిక భద్రతను కల్పించేందుకు తగిన చట్టాన్ని ఇంతవరకు అనుమతించలేదు. సి 189 ఆర్టికల్‌ కింద అవసరమైన భద్రతలను కల్పిస్తూ, మన న్యాయవ్యవస్థ ఆమోదం తెలియచేయలేదు. ప్రత్యేకించి దేశంలోని ఇతర కార్మికులతో సమంగా గృహకార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. 2011లో అధికారంలోఉన్న రాజకీయ వ్యవస్థ గృహకార్మికులకు భద్రత కల్పించడానికి వీలైన మార్పును అంగీకరించింది. అయితే 2014లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహకార్మికులకు సౌకర్యాలు కల్పించి కార్మికచట్టాన్ని తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఆ తర్వాత రెండుసార్లు జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రణాళికలోనూ గృహకార్మికులకు న్యాయబద్దమైన కార్మిక చట్టాన్ని తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఈ చట్టం చేయడానికే అన్నిటికంటే ముందు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. అయితే, 2020లో అప్పటికున్న దాదాపు 40కిపైగా కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్స్‌ను (కార్మిక స్మృతులు) రూపొందిస్తూ, పార్లమెంటు ఆమోదం తెలియజేసింది. అయితే ప్రభుత్వం సి 189 ఆర్టికల్‌ను ఆమోదించలేదు, ఇందుకు సంబంధించిన అంశాన్ని చర్చించనూ లేదు. ఈ నాలుగు కోడ్స్‌ కార్మికులకు తీవ్రమైన నష్టం కలిగించేదే. ఒక సంస్థలో ఐదుగురికి తగ్గకుండా గృహకార్మికులు పనిచేస్తున్నట్లయితే వారికి కనీస వేతనం లేదా వేతనాల చెల్లింపు, బోనస్‌ చెల్లింపు, కార్మికులతో సమానమైన రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకువీలుగా ఒక్క కోడ్‌లో ప్రస్తావించారు. గృహకార్మికులకు కనీసవేతన చట్టంకింద
వేతనం చెల్లించాలి. అలాగే బోనస్‌తోపాటు చట్టప్రకారం వేతనాలు పొందడం మౌలిక హక్కు. ఒక సంస్థలో లేదా ఇంటిలో నలుగురు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారికి కూడా తగిన వేతనాలు చెల్లించవలసిందే. దేశవ్యాప్తంగా గృహకార్మికులకు ఒక కోడ్‌ కింద కనీస వేతనాలు చెల్లించాలి. అయితే ఒక ఇంటిలో పనిచేసే కార్మికులకు కోడ్‌ కింద వేతనం చెల్లించాలనే అవకాశాన్ని కల్పించలేదు. కొత్తగా రూపొందించిన కార్మిక కోడ్‌ కింద ఇళ్లలో పనిచేసే అత్యధిక గృహ కార్మికులకు వేతనాలు చెల్లించే అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వం వారికి తీవ్రమైన నష్టాన్ని కలుగచేసింది. కనీస వేతనంకంటే చాలా తక్కువగా చెల్లిస్తారు. తప్పనిసరి అవసరమై ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో పేర్కొన్నది. ఇలాంటి కార్మికులకు సైతం వేతనాలు చెల్లించాలనే నిబంధనను కోడ్‌ కింద చేర్చలేదు. చట్టంలోని ఆర్టికల్‌ 23 కాకుండా, ఆర్టికల్‌ 3లోని సి 189 కింద కూడా పూర్తి ఉల్లంఘనకాదని కోడ్‌ పేర్కొంది. ఒక ఇంటిని సంస్థగా ప్రత్యేకించి గుర్తిస్తూ వేతనాలకు సంబంధించి కోడ్‌ పేర్కొనకపోవడం దుర్మార్గం. ఈ కోడ్‌ ఏమిచెబుతుందంటే, ఎటువంటి వృత్తిని చేపట్టినప్పటికీ, దానిని ఒక సంస్థగా పరిగణించాలి. అప్పుడే గృహకార్మికులు ముందుగా వృత్తిని గృహంలో పనిగా కోడ్‌ కింద గుర్తించడం జరుగుతుంది. కోడ్‌ కింద తగిన ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రతను కల్పిస్తూ, పథకాలను రూపొందించి కచ్చితంగా అమలుచేయాలి. వీరికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి. సామాజిక భద్రతతో సహా ఇతర అన్ని పథకాలకు కూడా గణనీయంగా నిధులను ప్రభుత్వం తగ్గించివేస్తోంది. గృహకార్మికులకు పెన్‌ తొహిలాలార్గాల్‌ సంఘం లాంటి యూనియన్లు పనిచేస్తున్నారు. తమిళనాడులో ఈ యూనియన్‌ పదేళ్లుగా పనిచేస్తోంది. గృహకార్మికులకు కనీసం ఈఎస్‌ఐ పథకాన్ని అమలు చేయాలని దశాబ్దికాలంగా డిమాండ్‌ చేస్తోంది. గతంలోఉన్న న్యాయవ్యవస్థ పరిధిలోని చట్టాల కింద నూతన కోడ్స్‌ కింద కూడా అమలుచేయడంలేదు. ఆర్టికల్‌ సి 189ని ఆమోదించకపోవడానికి కారణం ప్రభుత్వాలకు ఇష్టంలేక పోవడమే. 2022లో భారతదేశంలో గృహకార్మికులకు చట్టబద్దమైన వేతనాల హక్కులను అమలుచేయడానికి సంబంధించి యాజమాన్యాలు కల్పించకపోవడమే కారణం. అంతేకాదు, శాశ్వత ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచడానికి యాజమాన్యాలు అంగీకరించడం లేదు. అలాగే గృహకార్మికులు సేవలు అందించినప్పటికీ, భారీ సంఖ్యలో యాజమాన్యాలు వేతనాలు చెల్లించడానికి వారి వద్ద తగినన్ని నిధులు లేకపోవడం కూడా ఒక కారణం. ఒకవేళ యాజమాన్యాలు అంగీకరించాలని చట్టాలు రూపొందించినప్పటికీ అమలుచేసే స్థాయి యాజమాన్యాలకు ఉండకపోతే అది ఒక పెద్దసమస్య అవుతుందని, చెల్లించలేనివారికి జరిమానా విధించవలసివస్తుంది. అంతర్జాతీయ గృహకార్మికుల దినోత్సవం సందర్భంగా (జూన్‌ 16) 2022లో యాజమాన్యాల అఖిలభారత సంస్థలు, భారతదేశ యాజమాన్యాల సమాఖ్య గృహవేతనాలు చెల్లించడానికి శక్తి ఉన్నాయాజమాన్యాలు స్వచ్ఛందంగా గృహకార్మికులకు వేతనాలు చెల్లించాలని తీర్మానించాయి. అయినప్పటికీ, ఈ సంఘాలలో ఒక్కటికూడా తీర్మానాన్ని అమలుచేయడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని గృహకార్మికులకు వేతనాలతోపాటు ఈఎస్‌ఐ లాంటి పథకాలను అమలుచేయాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు