విశాలాంధ్ర -రాజాం (. విజయనగరం జిల్లా) : రాజాం డివిజన్ రాజాం మండలంలో నందబాలగ గ్రామంలో నవధాన్యాల సాగు నేలతల్లి బాగు
అగ్రికల్చర్ డివిజనల్ అసిస్టెంట్ చంద్రరావు ఆధ్వర్యంలో నవధాన్యాలు సాగుపై విస్తృత కార్యక్రమం నిర్వహించారు. 23 రకాలు విత్తనాలతో 12 కేజీలు ఒక కిట్టు చొప్పున చంద్రరావు సమక్షంలో తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవధాన్యాలు యొక్క ఉపయోగాలు అవగాహన కల్పించారు అలాగే ప్రతి ఒక్క రైతు ఒక ఎకరానికి 18 నుండి 30 రకాల విత్తనాలతో 10 నుండి 12 కేజీలు నవధాన్యాలు వేసుకోవాలని రైతులకు సూచించారు అనంతరం ప్రతి ఒక్కరు ఈ రకం విత్తనం ప్రాముఖ్యత గురించి వాటి ఉపయోగాలు గురించి భూమాత ఆరోగ్యం గురించి నేలలు సారవంతం గురించి రైతులతో అధికారులతో సంభాషించారు రైతులకు నవధాన్యాలు విత్తనాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ నేచురల్ ఫామింగ్ మాస్టర్ ట్రైనరీ పద్మ, యూనిట్ ఇంచార్జ్ పి.రమాదేవి, బి.రమాదేవి,మోడల్ మేకర్ కృష్ణమోహన్, ఐసిఆర్పి శ్రావణి తదితరులు రైతులు సమక్షంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.