Homeతెలంగాణబీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్

- Advertisement -

శాసనసభ సమావేశాల వేళ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అరెస్టులు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తాతా మధు తదితర నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు… బీఆర్ఎస్ మన్నె క్రిశాంక్ ను కూడా అరెస్ట్ చేశారు. క్రిశాంక్ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కార్ఖానా పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్రిశాంక్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నందునే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు