రాజాం (విజయనగరం జిల్లా) : రాజాంలోని ది సన్ స్కూల్లో బుధవారం అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ అశోక్ కుమార్ విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, మంటలను ప్రాథమిక స్థాయిలో ఎలా అదుపు చేయాలి, అగ్నిమాపక పరికరాలను ఎలా వినియోగించాలి వంటి అంశాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. విద్యార్థులతోనే ప్రాక్టికల్‌గా చేయించి, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించే విధానాన్ని చూపించడం విశేషం.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వై. భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
రాజాం ది సన్ స్కూల్లో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం
- Advertisement -


