Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమంత్రి ఇలాకాలో అవినీతి,అక్రమాలు..

మంత్రి ఇలాకాలో అవినీతి,అక్రమాలు..

- Advertisement -

నేతన్న సేవలో , నేతన్న పింఛన్ల లో నేతన్నలకు అన్యాయం

ఏడి అప్పాజీ, రమణారెడ్డి, శీనా నాయక్ ను సస్పెండ్ చేయాలి….

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం; ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ఇలాకాలో అవినీతి అక్రమాలకు హద్దే లేదని, నేతన్న సేవలో నేతన్న పింఛన్లు వేదనలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారుపట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఉన్న చేనేత హ్యాండ్లూమ్ కార్యాలయానికి పలువురు కార్మికులు ప్రదర్శన చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఎర్రం శెట్టి రమణ మాట్లాడుతూ గత నెల ఆగస్టు 7 న చేనేత కార్మికులు ఉపశమనం అందించే విధంగా నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించారు అని తెలిపారు. నేతన్న సేవ పథకంలో అర్హులకు ఖాతాలో పడకపోవడంతో చేనేత కార్మికులు నిరాశకు గురయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మరో పక్క ప్రజాప్రతినిధులు తేదీలు ప్రకటించుకుంటూ కాలయాపన చేయడం దారుణమని మండిపడ్డారు.
మరి నేటికీ నిజమైన కార్మికుడు కి న్యాయం జరిగే పరిస్థితి కనపడట్లేదు అని తెలిపారు. మరి చేనేత పెన్షన్తో మరోసారి అవినీతి అక్రమాలకు అధికారులు తెరలేపడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ చేనేత కార్మికులకు ఏ విధంగా అన్యాయం చేస్తారు? అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. వీటిపైన జిల్లా కలెక్టర్ తూతూ మంత్రంగా పర్యవేక్షణ నిర్వహించి, అవినీతి అక్రమాలపై నీగ్గు తేల్చకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చే విధంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయి *అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తు న చేనేత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు