రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బత్తలపల్లి రోడ్ సి ఎన్ బి ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటలకు రోటరీ మెంబర్షిప్ డెవలప్మెంట్ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రోటరీ క్లబ్ నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్, ఫాస్ట్ జిల్లా గవర్నర్లు, రోటరీ క్లబ్ కు సంబంధించిన జిల్లా ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, రోటరీ మెంబర్లు, గొప్ప స్పీకర్లు, ఆంధ్ర కర్ణాటక సంబంధించిన వివిధ ప్రదేశాల నుంచి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సెమినార్ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అనే విషయాలు తగిన సూచనల విధానాలు తెలియజేస్తారని తెలిపారు. కావున రోటరీ క్లబ్ కు సంబంధించిన ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
20న రోటరీ క్లబ్ సెమినార్ కార్యక్రమం నిర్వహణ..
- Advertisement -
RELATED ARTICLES


