Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. ప్రిన్సిపాల్ సుందరేశ్వరరావు

ఘనంగా జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. ప్రిన్సిపాల్ సుందరేశ్వరరావు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా.కె.సుందరేశ్వర్ రావు అధ్యక్షతన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రిన్సిపాల్ సుందరేశ్వర్ రావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లో భాగంగా కళాశాల చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. పారిశుధ్యం విద్యార్థుల అందరి బాధ్యత ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అది మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుందని,ప్రతి ఒక్కరు బాధ్యతగా వుండాలని తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాలలో పరిసర ప్రాంతాలను చక్కగా శుభ్రపరచి కళాశాల ఆవరణంలోని చెత్తను తోలగించి మొక్కలు నాటి స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆదినారాయణ, డా. హరి ప్రసాద్,మహీధర్ రావు,బి.ఆనంద్,ఏ. సౌజన్య లక్ష్మి, ఎస్ ఒబులపతి,తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు