- Advertisement -
విశాలాంధ్ర – డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): సెప్టెంబర్ 5వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన శెట్టి. అప్పలరాజు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన జి. జ్యోతిలక్ష్మి ని మండల విద్యాశాఖ అధికారి 2 జి. గెన్ను, సాటి ఉపాధ్యాయులందరూ శుభాకాంక్షలు తెలిపి వారికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


