రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పిలుపు….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ సూచనలతో ఈ నెల 6-8-2026 గురువారం ఉదయం 9:00 గంటలకు నార్పల మండల కేంద్రంలోని పాత గాంధీ సర్కిల్ (బస్టాండ్ ఏరియా) వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొననున్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నార్పల సత్యనారాయణ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పాటిల్ దివాకర్ రెడ్డి, ఫణీంద్ర, గవ్వల సాయి కృష్ణ, సోహైల్, అశోక్, హర్ష, నరేష్, హేమంత్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొనారు.


