ముంబయి: సౌత్ ఇండియన్ బ్యాంక్ 202627 ఆర్థిక సంవత్సరం మొదటి తైమాసికానికి (క్యూ1) రూ. 377.63 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది 202526 ఆర్థిక సంవత్సరం మొదటి తైమాసికంలోని రూ. 321.95 కోట్లతో పోలిస్తే 17.29% వృద్ధిని సూచిస్తుంది. ఏడాది ప్రాతిపదికన (వైఓవై) స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 3.15% నుండి 1.38%కి, అంటే 177 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 0.68% నుండి 0.26%కి, అంటే 42 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ‘రైట్ఆఫ్’ మినహాయించి ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) ఏడాది ప్రాతిపదికన 78.93% నుండి 81.40%కి, అంటే 247 బేసిస్ పాయింట్లు పెరిగింది. ‘రైట్ఆఫ్’తో కలిపి పీసీఆర్ ఏడాది ప్రాతిపదికన 88.82% నుండి 94.51%కి, అంటే 569 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన 23.05% వృద్ధితో రూ. 1,025 కోట్ల అత్యధిక నికర వడ్డీ ఆదాయం నమోదైంది. రిటైల్ డిపాజిట్లు రూ. 1,09,368 కోట్ల నుండి రూ. 1,24,306 కోట్లకు పెరిగాయి (రూ. 14,938 కోట్ల పెరుగుదల). ఇది ఏడాది ప్రాతిపదికన 13.66% వృద్ధిని సూచిస్తుంది. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు రూ. 32,293 కోట్ల నుండి రూ. 36,432 కోట్లకు పెరిగాయి (రూ. 4,139 కోట్ల పెరుగుదల). ఇది ఏడాది ప్రాతిపదికన 12.82% వృద్ధిని సూచిస్తుంది. కాసా (కరెంట్, సేవింగ్స్ ఖాతాలు) ఏడాది ప్రాతిపదికన 14.61% వృద్ధిని నమోదు చేసింది. ఇందులో సేవింగ్స్ ఖాతాలు 16.51%, కరెంట్ ఖాతాలు 6.95% చొప్పున పెరిగాయి. అలాగే, స్థూల అడ్వాన్సులు రూ. 15,170 కోట్లు పెరిగాయి రూ. 89,198 కోట్ల నుండి రూ. 1,04,368 కోట్లకు పెరిగింది (ఏడాది ప్రాతిపదికన 17.01% వృద్ధి). మంచి రేటింగ్ కలిగిన రుణగ్రహీతల ఖాతాలలో, కార్పొరేట్ విభాగం రూ. 37,110 కోట్ల నుండి రూ. 41,704 కోట్లకు పెరిగింది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ రూ.377.63 కోట్ల నికర లాభం నమోదు
- Advertisement -


