Saturday, November 30, 2024
Homeఅంతర్జాతీయంస్వతంత్ర పలస్తీనాతోనే పరిష్కారం

స్వతంత్ర పలస్తీనాతోనే పరిష్కారం

స్వతంత్ర పలస్తీనాతోనే పరిష్కారం

ఏథెన్స్‌: పలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సంఫీుభావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) తరపున పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌట్సోంబస్‌ సంపూర్ణ సంఫీుభావాన్ని ప్రకటించారు. ‘ఇజ్రాయిల్‌ది మారణహోమమని, నెతన్యాహు చేస్తున్నది యుద్ధ నేరమని, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ)కు ఆయన వాటెండ్‌ నేరస్తు డని, అమెరికా, నాటో, యూరోపి యన్‌ యూనియన్‌ మద్దతుతో గాజా స్ట్రిప్‌లో జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తున్న పలస్తీనా ప్రజలతో… యావత్‌ ప్రపంచ ప్రజలతో మా గళాన్ని కలుపుతున్నాం’ అని దిమిత్రిస్‌ ఉద్ఘాటించారు. పశ్చిమాసియాతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. న్యూ డెమొక్రసీ ప్రభుత్వం అధ్వర్యంలో నాటో దేశాల మద్దతుతో యుద్ధాల్లో మా దేశం జోక్యం చేసుకోకుండా మా ప్రజలు పోరాడుతున్నారని ఆయనన్నారు. ఈ పరిణామాలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు. ఎర్ర సముద్రం ఫ్రిగేట్‌ నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గాలని, ఇజ్రాయిల్‌తో తెగతెంపులు చేసుకోవాలని, సైనిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆత్మరక్షణ సాకుతో 17వేల మంది చిన్నారులు సహా 44వేల మంది పలస్తీనియన్ల ప్రాణాలు తీయడం, వెస్ట్‌బ్యాంక్‌, లెబనాన్‌, సిరియా, యమెన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదని దిమిత్రిస్‌ కౌట్సోంబస్‌ తేల్చిచెప్పారు. సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడుతుండటాన్ని ఆత్మరక్షణ అంటే ప్రపంచంలో ఎక్కడా ఒప్పుకోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. 1967 ఒప్పందం ప్రకారం నిర్దేశించిన సరిహద్దులతో, తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర ఏకీకృత పలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమన్నారు.స్వతంత్ర పలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు 2015లో గ్రీక్‌ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. నాటి ఆ నిర్ణయాన్ని తక్షణమే మన దేశం అమలు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున గ్రీస్‌ ప్రభుత్వాన్ని దిమిత్రిస్‌ డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు