Homeవ్యాపారంహీరో మోటోకార్ప్ సరికొత్త ‘ప్యాషన్ ప్లస్ డిస్క్క’ మార్కెట్‌లోకి విడుదల

హీరో మోటోకార్ప్ సరికొత్త ‘ప్యాషన్ ప్లస్ డిస్క్క’ మార్కెట్‌లోకి విడుదల

- Advertisement -

ముంబయి: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, సరికొత్త ‘ప్యాషన్G డిస్క్క’ను మార్కెట్‌లోకి లాంచ్ చేసినట్లు నేడు ప్రకటించింది. రోజువారీ ప్రయాణికులకు ఆధునిక మొబిలిటీ పరిష్కారాలను అందించాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ సెíట్లిష్, ఫీచర్`రిచ్ కొత్త వేరియంట్ మరింత బలపరుస్తుంది. పట్టణాల్లో రోజువారీ ప్రయాణాలకు, ఆచరణాత్మక అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఈ మోటార్‌సైకిల్.. అత్యుత్తమ పనితీరు, ఇంధన సామర్థ్యం, సౌకర్యాల మేలు కలయికతో నేటితరం రైడర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ లాంచ్ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యమూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ.. “సరికొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్క విడుదల.. భారతదేశంలో అత్యంత నమ్మకమైన, ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటిగా ఉన్న ‘ప్యాషన్’ వారసత్వాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. సరికొత్త స్టైలింగ్, అధునాతన డిజిటల్ ఫీచర్లు, ఫ్రంట్ డిస్క్క బ్రేక్ ద్వారా పెరిగిన భద్రత, అత్యుత్తమ మైలేజీతో.. ప్యాషన్ ప్లస్ డిస్క్క నేటి వినియోగదారులకు ఒక అద్భుతమైన ప్యాకేజీని అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ బ్రాండ్ ఆకర్షణను మరింత పెంచడంతో పాటు, ఈ విభాగంలో హీరో మోటోకార్ప్ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు. సరికొత్త ప్యాషన్G డిస్క్క ఒక సరికొత్త వ్యక్తిత్వంతో, సమకాలీన డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది. ప్యాషన్ సిరీస్‌కు ఉన్న ఐకానిక్ లక్షణాలను ఏమాత్రం కోల్పోకుండానే.. నేటి పట్టణ ప్రయాణికుల పెరుగుతున్న ఆకాంక్షలకు అద్దం పట్టేలా దీనిని తీర్చిదిద్దారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు