హైదరాబాద్: ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా, నీల్సన్‌ఐక్యూ భాగస్వామంతో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ తాజాగా ఒక కొత్త నివేదికను వెల్లడిరచింది. పట్టణ భారతీయులను ఏది ఆనందంగా, ఆశావాహకంగా ఉంచుతోంది అని ‘లైఫ్ ఈజ్ గుడ్ సర్వే‘ శీర్షిక గల నివేదిక తెలియచేసింది. భారతదేశంలో ఎనిమిది ప్రధానమైన పట్టణాలలో 1313 మందిపై ఈ అధ్యయనం జరిగింది. ఇది వ్యక్తిగత సంబంధాలు, విజయాలు, ఆనందాల మధ్య శక్తివంతమైన సహ సంబంధం ఉందని వెల్లడిరచింది. స్నేహితులు, కుటుంబంతో గడిపిన నాణ్యమైన కాలంతో ‘లైఫ్ ఈజ్ గుడ్’ క్షణాలను 54% పట్టణ భారతీయులు సంబంధాన్ని కలిగి ఉండగా, 45% మంది ప్రత్యేకంగా ‘లైఫ్ ఈజ్ గుడ్’ విషయంతో కుటుంబ బంధంతో అనుసంధానం చేసారు.