విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కేశవ నగర్ లో ఈనెల 14వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయమునకు అయ్యప్ప పండుగలలో పలు కార్యక్రమాలకు రథము అవసరముంటుంది అన్న సంకల్పంతో పట్టణంలోని ఓంకార్ సిల్క్స్ కు చెందిన అయ్యప్ప భక్తాదులు ఆలయంలో రథమును అందజేశారు. ఈ సందర్భంగా ఓంకార్ సిల్క్స్ అధినేతలు మాట్లాడుతూ మా కుటుంబంలోని పూర్వీకుల నుండి గత 30 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామిని కొలుచుచున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో అయ్యప్ప దేవాలయం ప్రతిష్టించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిన సందర్భంలో ఒక అయ్యప్ప భక్తులుగా తమ కుటుంబం తరఫున ఒక రథమును ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రథమును బెంగళూరులో రెండు నెలలుగా తయారుచేసి, విడిభాగాలను ఇక్కడ వచ్చి అమర్చడం జరిగిందని తెలిపారు. తదుపరి దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురుస్వామి విజయ్ కుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండపల్లి వెంకట జయప్రకాష్ ఓంకార్ సిల్క్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతూ, వారు ఆశీస్సులను అందజేశారు.