Homeఆర్‌టీఈ సవరణ… ఎనఈపీ ఉపసంహరణ

ఆర్‌టీఈ సవరణ… ఎనఈపీ ఉపసంహరణ

- Advertisement -

టెట్ మినహాయింపు
ఉద్యోగాల క్రమబద్ధీకరణ

. ప్రైమరీ టీచర్లకు ‘ఎమ్మెల్సీ’ ఓటు హక్కు
. కనీస వేతనాలు పాత పింఛన్ పథకం అమలు
. ఏపీ జాక్టో డిమాండ్ దిల్లీలో భారీ ధర్నా
. మొదటిసారి ఏకతాటిపైకి టీచర్ల సంఘాలు
. మద్దతిచ్చిన వామపక్ష నాయకులు

న్యూదిల్లీ: విద్యా హక్కు (ఆర్‌టీఈ) చట్టాన్ని సవరించి సర్వీసులో ఉన్న టీచర్లకు రక్షణ కల్పించే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత టీచర్ల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏపీ జాక్టో) స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులో రివ్యూ లేదా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని కోరింది. కొత్త పింఛన్ పథకానికి (ఎన్‌పీఎస్) వ్యతిరేకంగా 22 ఏళ్ల పోరాటం తర్వాత తెచ్చిన ఏకీకత పింఛన్ పథకం (యూపీఎస్) రద్దు, పాత పింఛన్ పధకం (ఓపీఎస్) పునరుద్ధరణకు డిమాండ్ చేసింది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం జాతీయ స్థాయి టీచర్ల యూనియన్లు మొదటిసారిగా ఏకతాటిపైకి వచ్చాయి. దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించాయి. డిమాండ్ల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునేలా పాలకులపై ఒత్తిడి తేవాలని సంకల్పించాయి. కార్యక్రమానికి సీఎన్ భారతి (ఎస్‌టీఎఫఐ), కె.నరసింహా రెడ్డి (ఏఐఎస్‌టీఎఫ్), బసవరాజ్ గురికర్ (ఏఐపీటీఎఫ్), సీఎల్ రోస్ (ఏఐఎఫ్‌టీఓ) అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, ఎంపీ సెల్వరాజ్, సీపీఎం ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.సదాశివన్, కుమార్ నాయక్ (కాంగ్రెస్), రాజా రామ్ సింగ్ (సీపీఐ ఎంఎల్) హాజరయ్యారు. టీచర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. టీచర్ల సమస్యలపై పార్లమెంటులో గళం వినిపిస్తామని ఎంపీలు హామీనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి, శ్రీపాల్ రెడ్డి (తెలంగాణ), వ్యవసాయ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు చావా రవి (ఎస్‌టీఎఫఐ), సదానందన్ గౌడ్ (ఏఐఎస్‌టీఎఫ్), కమలా కాంత్ త్రిపాఠి (ఏఐపీటీఎఫ్), రామమూర్తి స్వామి (ఏఐఎఫఈటీఓ), పి.దామోదర్ రెడ్డి (ఏఐఎఫ్‌టీఓ), ప్రపంచ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు అమియా కుమార్ మహంతి, ఏఐఎఫ్‌యూసీటీఓ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ అరుణ్ కుమార్, ఏఐఎఫఆర్‌టీఈ కార్యదర్శి, ప్రొఫెసర్ వికాస్ గుప్తా, ఏఐఎసఈసీ కార్యదర్శి శారదా దీక్షిత్, ఏఐఐటీఏ అధ్యక్షుడు రిజ్వాన్ తదితరులు ప్రసంగించారు. సర్వీస్‌లోని ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ కోసం ఉపాధాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐ జాక్టో ఏర్పాటు చారిత్రకమని వక్తలు అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఐక్యవేదిక ఏర్పాటునకు దోహదమైన టెట్ వ్యవహారం, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కారణమని, అందుకు కతజ్ఞులమని వ్యాఖ్యానించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఐదేళ్లకుపైగా పదవీ కాలం మిగిలివుంటే తప్పనిసరిగా రెండేళ్లలోగా టెట్ ఉత్తీర్ణత సాధించాలి, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొన్నదని వక్తలు గుర్తుచేశారు. పదవీ విరమణకు మరో ఐదు సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ సమయం ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపు ఉంది కానీ వారు పదోన్నతలకు అర్హత కోల్పోతారన్నారు. ఇది 2010 ఆగస్టు 23న జారీ చేసిన ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌కు పూర్తి విరుద్ధమని, ఆ తేదీ తర్వాత నియమితులైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే పద్ధతిని గత 15ఏళ్లుగా పాటిస్తున్నా… ఈ వాస్తవాలను సుప్రీం కోర్టుకు తెలియజేయడంలో ఎన్‌సీటీవీ విఫలమైనందునే ఇలాంటి తీర్పు వచ్చిందని వక్తలు అసహనం వ్యక్తంచేశారు.
ఐదేళ్లు మిగిలివున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌టీఈ చట్టాన్ని సవరించి సర్వీసులోని టీచర్లకు రక్షణ కల్పించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతని స్పష్టం చేశారు. విద్య వ్యాపారీకరణ`కార్పొరేటీకరణకు దారితీసే నఈపీ 2020 ఉపసంహరణకు డిమాండ్ చేశారు. స్కూళ్ల విలీనం, మూసివేతలు ఆపాలన్నారు. గత ఐదేళ్లలో లక్షకుపైగా పాఠశాలలు మూతబడినట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, వేనత జీవులపై ఆదాయపు పన్ను భారం తగ్గించాలని, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని టీచర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యల సత్వర పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏఐ జాక్టో హెచ్చరించింది. తమ పోరాటంలో కలిసి రావాలంటూ టీచర్లు, ఎడ్యుకేషన్ వర్కర్లతో పాటు మద్దతుదారులు, శ్రేయోభిలాషులక” పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు