Homeజాతీయంఆ దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు

ఆ దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు

- Advertisement -

న్యూదిల్లీ: ఇరాన్‌లో ఉద్రిక్తతలతో సెంట్రల్ ఆసియాకు ఇండిగో విమాన సేవలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11 వరకు తబిలిసి (జార్జియా), అల్మాటీ (కజకిస్థాన్), బకు (అజర్ బైజాన్), తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్ )కు తమ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణాల దష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ప్రధానమని ఎక్స్‌లో ఇండిగో పోస్టు పెట్టింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు