Homeజాతీయందర్యాప్తు నివేదిక వచ్చాకే…

దర్యాప్తు నివేదిక వచ్చాకే…

- Advertisement -

జస్టిస్ వర్మ అభిశంసనపై రిజిజు

న్యూదిల్లీ: అల్లాహాబాద్ హై కోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన త్రిసభ్య దర్యాప్తు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ వ్యవహారంలో నిర్ణయం ఉంటుందన్నారు. రిజిజు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ వర్మ వ్యవహారాన్ని సముచిత కమిటీకి సిఫార్సు చేశారు… ప్రక్రియ కొనసాగుతోంది. దర్యాప్తు నివేదిక వచ్చాక ఏ విధంగా ముందుకెళ్లాలో నిర్ణయిస్తారు. అంతకుమించి ఏమీ చెప్పలేను’ అని అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చిస్తారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని కేంద్రమంత్రి దాటవేశారు. గతేడాది ఆగస్టు 12న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంలో దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 14న అధికారిక నివాసంలో నోట్ల కట్టలను తగలబెట్టిన తర్వాత జస్టిస్ వర్మను దిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు పంపారు. దర్యాప్తు కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి అరవింద్ కుమార్, మద్రాసు హైకోర్టు సీజే మనిందర్ మోహన్ శ్రీవాత్సవ, కర్నాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బీవీ ఆచర్య సభ్యులుగా ఉన్నారు. కాగా, జస్టిస్ వర్మ తనంతట తానుగా రాజీనామా చేస్తే… హైకోర్టు రిటైర్డ్ జడ్జిగా పింఛన్, ప్రయోజనాలు పొందవచ్చు. అదే పార్లమెంటు వేటు వేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనాలు లభించవని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు