Thursday, April 3, 2025
Homeవ్యాపారంఇకపై ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌లోనూ పెన్షన్‌ పంపిణీ

ఇకపై ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌లోనూ పెన్షన్‌ పంపిణీ

ముంబై: భారత ప్రభుత్వ సెంట్రల్‌ పెన్షన్‌ అకౌంటింగ్‌ ఆఫీస్‌ (సిపిఏఓ) తమ తరపున పెన్షన్లు పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చిందని ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ బుధవారం వెల్లడిరచింది. ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అంటే – ఆల్‌ ఇండియా సర్వీస్‌ అధికారులు, మాజీ పార్లమెంటు సభ్యులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, భారత మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పౌర మంత్రిత్వ శాఖలు, విభాగాల అధికారులు (రైల్వేలు, పోస్ట్‌లు, టెలికాం మరియు రక్షణ కాకుండా) పెన్షన్‌లను పంపిణీ చేయడానికి బ్యాంకును అనుమతిస్తుంది. పెన్షనర్లు ఇప్పుడు వారి ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలో నేరుగా వారి పెన్షన్‌ను పొందవచ్చు. పెన్షనర్లు తమ జీవిత భాగస్వామితో కలిసి ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాను తెరిచి పెన్షన్‌ పొందవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు