Friday, March 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈనెల 15 నుండి ఒంటి పూట బడులు ప్రారంభం

ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు ప్రారంభం

ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం పట్టణము, రూరల్ పరిధిలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఒంటి పూట బడులు (మార్నింగ్ స్కూల్) ఉదయం 7:45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలను నిర్వహించాలని తెలిపారు. ఎండాకాలం అధికంగా ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధలు కనపరచాలని తెలిపారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు హెడ్మాస్టర్లు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా తగిన సూచనలు, సలహాలు తప్పక ఇవ్వాలని తెలిపారు. పాఠశాల అయిపోయిన తర్వాత ఎటువంటి అదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. అలా నిర్వహిస్తే ఆ పాఠశాల హెడ్మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోబడునని వారు తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా ఒంటిపూట బడులను తప్పక అమలు చేయాలని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులకు సర్కులర్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఎండ అధికంగా ఉన్నందున, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు