సీఈసీ జ్ఞానేశ్ కుమార్
లక్నో: భారత్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) ఇంట ర్నెట్, బ్లూటూత్, వై-ఫై వంటి వైర్లెస్ సాంకేతికతలకు అనుసంధానమై ఉండవని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. లక్నోలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ఆయన చారిత్రక కోల్విన్ తాలూకాÝర్స్ కళాశాలలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల విశ్వసనీయత, యువ ఓటర్ల ప్రాధాన్యంపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఈవీఎంలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ… భారత్లో వినియోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని, వాటికి ఇంటర్నెట్, బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీ ఉండదని తెలిపారు.
సమాచారాన్ని ధ్రువీకరించాలి
సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు దాని మూలం, విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని జ్ఞానేశ్ కుమార్ యువతకు సూచించారు. సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోకుండా ఇతరులతో పంచుకోవద్దని కోరారు. భారత్లో సుమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ఒక పెద్ద సవాలని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రస్తావిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎన్నికల సంఘం డిజిటల్ వేదికల ద్వారా ఓటరు నమోదు సౌకర్యాలను అందిస్తోందన్నారు.
యువత తమంతట తాము ఓటర్లుగా నమోదు కావడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఎన్నికల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ‘దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు యువతే అత్యంత కీలక శక్తి. అవగాహనతో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవు తుంది’ అని జ్ఞానేశ్ కుమార్ అన్నారు.
ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వై-ఫై కనెక్షన్ లేదు
- Advertisement -
RELATED ARTICLES


