Thursday, April 3, 2025
Homeవిశ్లేషణఉక్రెయిన్‌ ఖనిజాలకు ఐరోపా, యూఎస్‌ ఆరాటం

ఉక్రెయిన్‌ ఖనిజాలకు ఐరోపా, యూఎస్‌ ఆరాటం

బుడ్డిగ జమిందార్‌

ఉక్రెయిన్‌, రష్యాతో అమెరికా కుదుర్చు కుంటున్న శాంతి ఒప్పందాలకు యూరపు యూనియన్‌లోని ప్రధాన దేశాలు ససేమిరా అంటున్నాయి. యూరపులో సైనిక, పునరాయుధీ కరణను వేగవంతం చేయటానికి నిర్ణయించు కొన్నాయి. ఇందుకు ఈ సంవత్సరంలో 80,000 కోట్ల డాలర్లు (69 లక్షల 60వేల కోట్ల రూపాయలు) వెచ్చించాలని నిర్ణయించాయి. ఇది 202526 సంవత్సర మన జాతీయ బడ్జెట్టు ఆదాయంకంటే రెండిరతలు ఎక్కువ. 2024లో యూరోపియన్‌ యూనియన్‌ మొత్తం ప్రపంచ మిలిటరీ ఖర్చులో భాగంగా 45,700 కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి. 2023తో పోలిస్తే ఈ ఖర్చు 11.7 శాతం ఎక్కువ. తాజాగా 2024 నుంచి 2025కి ఏకంగా 80,000 కోట్ల డాలర్లకు పెంచటమంటే 57 శాతం ఎక్కువ. యూరపు దేశాల్లో రష్యాపై విధించిన గ్యాస్‌ ఆంక్షలు ఆర్థిక వ్యవస్థల తిరోగమనానికి దారితీశాయి. దీనికితోడు ఈ సంవత్సరం పెరగనున్న ఆయుధ ఖర్చులతో రానున్న కాలంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయో ఊహించుకోవచ్చు. ఉక్రెయిన్‌లోని ఖనిజ సంపదపై అమెరికాయూరపు దేశాలు కన్నేయ టమే అసలు ఉక్రెయిన్‌ యుద్ధానికిగానీ, ప్రస్తుత అమెరికా`ఉక్రెయిన్‌ శాంతి ప్రతిపాదనలను తిరస్కరించటానికి గానీ కారణం చూడాలి. 2021లో యూరోపియన్‌ యూనియన్‌కు, ఉక్రెయిన్‌కు మధ్య ముడి పదార్థాల భాగస్వా మ్యంపై ఒప్పందం కుదిరింది. ఇప్పుడీ ఒప్పంద పునరుద్ధరణ కోసం యూరప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూరప్‌నకు అవసరమైన 30 కీలకమైన ముడిపదార్థాలలో 21 ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. ఈ ఖనిజ సంపద అమెరికాకంటే యూరప్‌నకు చాలా అవసరం. ప్రస్తుత వస్తు ఉత్పత్తి కోసం అవసరమైన ఖనిజ సంపదను ట్రంప్‌ మళ్లించుకొనే ప్రయత్నాన్ని ఈయూ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. శాంతి ఒప్పందాన్ని తిరస్కరించి, అమెరికా సహాయం లేకపోయినా తామే ఉక్రెయిన్‌కు మద్దతు పలికి రష్యాతో యుద్ధాన్ని కొనసాగించి ముడి పదార్థాలపై పట్టును సాధించు కోవాలను కొంటున్నాయి. దీని కోసం మిలిటరీ వ్యయం పెంచటంతోపాటు, ఈయూ దేశాల సైనికులను ఉక్రెయిన్‌లో ఉంచి, యూరపు యుద్ధ విమానాలను రంగంలోకి దింపాలనుకొంటున్నాయి. ఇంతటితో ఆగక ఫ్రాన్స్‌ దేశం మిలిటరీ ఖర్చు రెట్టింపు చేసి జీడీపీలో 5శాతం వరకూ వెచ్చిస్తా నంది. అణ్వస్త్రాల తయారీని పెంచుతామని అవసరమైతే అణ్వాయుధాలను రష్యాపై గురిపెడతామని అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటించారు. ఇది రష్యా భద్రతకు విఘాతం కల్గిస్తుందని రష్యా విదేశాంగమంత్రి లావ్‌కోవ్‌ ప్రకటన చేస్తూ, రష్యా చూస్తూ వూరుకోదని స్పష్టం చేశారు.
జర్మనీ ప్రభుత్వం 2024లో ఖర్చు చేసిన 10,000 కోట్ల డాలర్లకు అదనంగా మరొక 20,000కోట్ల డాలర్లతో మొత్తం 30,000కోట్ల డాలర్లను 2025లో ఖర్చు చేయటానికి నిర్ణయించింది. అదే సమయంలో జర్మనీలోని కీలకమైన పరిశ్రమలను పౌరఉత్పత్తి నుంచి ఆయుధాల ఉత్పత్తికు మార్చ మని ఒత్తిడి తెస్తోంది. జర్మనీలో కాబోయే నూతన ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ నూతన ఆయుధాల తయారీతో తన ప్రభుత్వపాలనను ప్రారంభించను న్నారు. రెండవ ప్రపంచయుధ్దంలో 6కోట్ల ప్రజల మరణానికి కారకులైన ఫాసిస్టు హిట్లర్‌ పాలన నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు గనకనే మిలిటరీశక్తిగా జర్మనీకి పూర్వశక్తిని తెస్తానని ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అంటున్నారు. కానీ అదనపు మిలిటరీ ఖర్చును అటు అతిమితవాద ఏఎఫ్‌డీతోపాటు లెఫ్ట్‌ పార్టీలు తిరస్కరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు పార్లమెంటులో 30శాతం సీట్లు ఉన్నాయి, గత పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు సీట్లు దక్కాయి.
2024వ సంవత్సరంలో ప్రపంచ దేశాలు మిలిటరీకి 2లక్షల 26కోట్ల డాలర్లు వెచ్చించాయి. దీనిలో సింహభాగం 96,800 కోట్ల డాలర్లను అమెరికా ఖర్చు చేసింది. ప్రపంచంలో 5 శాతం జనాభా ఉన్న అమెరికా మొత్తం మిలిటరీ ఖర్చులో 39శాతం ఖర్చు చేసింది. రెండవ స్థానంలో చైనా 23,500 కోట్ల డాలర్లతో ఉంది. రష్యా 14,600 కోట్ల డాలర్లతో తృతీయస్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ దేశాలపై అజమాయిషీ కోసం అమెరికా చేస్తున్న మొత్తం మిలిటరీ ఖర్చు తన కింద ఉన్న 12 దేశాల మిలిటరీ ఖర్చుతో సమానంగా ఉంది. గడచిన 80 సంవత్సరాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంతగా ఆయుధపోటీకి నిధులు కేటాయించటమంటే ఇప్పటికే అనేక సాంఘిక సమస్యలపై సతమతమవు తున్న యూరపు ప్రజల వెన్నెముకపై మరింత భారం పడుతుంది. ప్రస్తుతం అక్కడి సాంఘిక సమస్యలపై అనేక సమ్మెలు, ఆందోళనలకు దిగుతున్న యూరపు దేశాల ప్రజల ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం ఉంది. పరోక్షంగా ఆయుధ పోటీలో భారతదేశంపై కూడా తీవ్ర ప్రభావం ఉం టుంది. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌ను కలిసినప్పుడు అమెరికాకు మన దేశంతో ఉన్న 4600కోట్ల డాలర్ల వాణిజ్య లోటును ఎఫ్‌ 35 స్టీల్‌ (రహస్య) యుద్ధ విమానాల ద్వారా భర్తీ చేయాలనుకోవటం దీనినే సూచిస్తుంది. ప్రపంచ జనాభాలో 7శాతం యూరపు దేశాల్లో ఉన్నారని, ప్రపంచ జీడీపీలో 25% భాగస్వామ్యం ఉండగా ప్రపంచ సాంఘిక సంక్షేమంలో 50శాతంతో ప్రథమస్థానంలో ఉన్న సానుకూల పరిస్థితుల్ని ఇప్పుడు యుద్ధం పేరుతో మరిన్ని సాంఘిక కోతల దిశగా ముందుకు పోనున్నాయి.
2025 సంవత్సరానికి యూరపు దేశాలు (రష్యా మినహా) 80000 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తామంటుంటే ప్రజల జీవన విధానాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఒకవైపు మిలిటరీ ఖర్చులు పెంచుకొంటూ పోతుండగా మరొకవైపు సంక్షేమ పథకాల నుంచి దేశాలు చేతులెత్తేస్తున్నాయి. తాజాగా అమెరికాలో నూతన సాంఘిక కోతలు ప్రారంభించారు. ఉదాహరణకు అమెరికా ఫెడరల్‌ విద్యావిధానంలో పనిచేస్తున్న సగం ఉద్యోగుల్ని ఈ వారం తొలగించి విద్యను ముమ్మరంగా ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తున్నది. దేశంలో నిరుద్యోగం పెరగటానికి కారణమవుతుంది. ‘అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం’ తప్పుతుందని యూరపుదేశాలు ప్రచారం చేస్తూ మిలిటరీని ఆధునీకరించటం ద్వారా స్వేచ్ఛామార్కెట్‌ ఆర్థిక వ్యవస్థల్లో పట్టును కోల్పోకుండా ఉండాలని, ఉక్రెయిన్‌లో విజయం సాధించటం ద్వారా అటు అమెరికాను ఇటు రష్యాను ఓడిరచి తమ దేశాల్లోనూ, అంతర్జాతీయంగానూ ముడి పదార్థాలపై అజమాయిషీ పెంచుకొని మార్కెట్ల పోటీల్లో తాము గెలవాలని ఐరోపా దేశాలు కోరుకుంటున్నాయి. దీనికోసం శాంతిని, కాల్పుల విరమణను ఫణంగా పెడుతూ మిలిటరీ వ్యయాన్ని పెంచే సన్నాహాలకు మొగ్గు చూపుతున్నాయి.
సెల్‌ : 9849491969

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు