పట్నా: న్యూఢిల్లీ నుంచి పట్నా బయలుదేరిన ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయంలోలో ల్యాండ్ అవుతున్న విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ అంశాన్ని విమానాశ్రయం అధికారుల దృష్టికి పైలట్ తీసుకెళ్లారు. దీంతో అగ్నిమాపక, అత్యవసర సేవలను అధికారులు మోహరించారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఈ విమానానికి సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. రన్ వేపై దిగుతున్నప్పుడు విమానం కుడి వైపు ఇంజిన్ను పక్షి ఢీకొట్టినట్లు పరిశీలనలో తేîలిందన్నారు. కానీ విమానం ఇంజిన్కు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు. భద్రతా తనిఖీల అనంతరం విమానం దిల్లీకి దాదాపు గంటన్నర ఆలస్యంగా బయలుదేరిందని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు.


