విజయ్ భార్య మారెమ్మకు ఆర్థిక సహాయం అందజేస్తున్న వైసీపీ నేతలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : వాస్కులర్ వ్యాధితో బాధపడుతున్న మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన హరిజన విజయ్ కు చికిత్స నిమిత్తం మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, పత్తికొండ నియోజకవర్గం పరిశీలకులు సీతారామరెడ్డి ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకులు అందరూ కలిసి భార్య మారెమ్మకు 85000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రామలింగారెడ్డి, దొడ్డిమేకల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ రఘురామ్, నాయకులు బ్రహ్మయ్య ఆచారి, ముక్కరన్న, అర్లప్ప, మేకల రాజు, ప్రసాద్,సుందరం, ఏసన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


