సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని సర్వే నెంబర్ 650-2 పై తగిన న్యాయం చేయాలని కోరుతూ ఏఐటియుసి, కార్మిక సంఘం, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మిక సంఘం, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న కూడా సంబంధిత అధికారులు స్పందన లేదు. దీంతో సిపిఐ, వాటి అనుబంధ సంస్థలు, ఇతర సంఘాలతో కలిసి వంట వార్పు కార్యక్రమాన్ని తాసిల్దార్ కార్యాలయ ముందు భాగాన అక్కడే నిర్వహించారు.ఈ కార్యక్రమ నిర్వహణను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో, ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి,రిలే దీక్షల లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ దాదాపు మూడు నెలల నుంచి ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికుల సమస్యల గురించి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో , భారతకమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపడుతున్న ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లి వారి సమస్యల గురించి అధికారులకి విన్నవించడం జరిగింది అని, వారి నుంచి స్పందన రాకపోవడం దారుణం అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని అనేక విధాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అని, అధికారులలో ఎందుకు చలనం రావడం లేదో మాకు అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్వే నెంబర్ పై ర్యాలీలు,ధర్నాలు చేయడం కూడా జరిగిందని, అయినా కూడా రెవెన్యూ అధికారులో ఎటువంటి స్పందన లేదు అని తెలిపారు. కార్మికులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అధికారులు కార్మికుల పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు..కార్మికులకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటంలో కార్మికులకు అండగా ఉంటామని వారికి న్యాయం చేసే వరకు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, రామకృష్ణ, రామసుబ్బయ్య,సురేంద్ర, మసూద్, వేణుగోపాల్,ఓబులేసు, నాగేంద్ర,చిన్న, జనార్ధన్, మహిళా నాయకులు లలితమ్మ, లింగమ్మ ,ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.