Thursday, April 3, 2025
Homeవ్యాపారంగోద్రేజ్‌ జెర్సీ సరికొత్త వ్యూహం ఆవిష్కరణ

గోద్రేజ్‌ జెర్సీ సరికొత్త వ్యూహం ఆవిష్కరణ

హైదరాబాద్‌ : దక్షిణాది పాడి పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న గోద్రేజ్‌ జెర్సీ, శుక్రవారం 2026 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై26) కోసం దాని సరికొత్త 3I3 లీప్‌ఫ్రాగ్‌ వ్యూహాన్ని ఆవిష్కరించింది. ఈ ముందస్తు ఆలోచనాత్మక చొరవ కంపెనీ ఉత్పత్తి శ్రేణిని విస్తరించడం, విస్తృత స్థాయిలో మార్కెట్‌లోకి చొచ్చుకుపోవడాన్ని ప్రోత్సహించడం, నిరంతర ఆవిష్కరణల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. బాదం మిల్క్‌, పనీర్‌, పెరుగు అనే మూడు ప్రధాన ఉత్పత్తులపై దృష్టి సారించడం ద్వారా గోద్రేజ్‌ జెర్సీ పాల విలువ ఆధారిత పోర్ట్‌ఫోలియోలో ఆధిపత్య శక్తిగా ఎదిగేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటోంది. ఆంధ్ర తెలంగాణలో తమ ‘‘విలువ ఆధారిత ఉత్పత్తి’’ పోర్ట్‌ఫోలియో కోసం ట్రయల్స్‌ను పెంచడం, ప్రాంతీయ మార్కెట్లలో బాదం పాలు, పన్నీర్‌ పరిధిని పెంచడం, నిరంతర ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యమని గోద్రేజ్‌ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు