Thursday, December 26, 2024
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా సిపిఐ జెండా ఆవిష్కరణ…

ఘనంగా సిపిఐ జెండా ఆవిష్కరణ…

విశాలాంధ్ర నందిగామ :-ప్రజా పోరుబాటలో ప్రజా సేవలో సిపిఐ తన వంతు పోరాటాలు చేస్తూనే ఉంటుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు వెంకట సుబ్బారావు అన్నారు గురువారం స్థానిక రైతు పేట సి ఎస్ ఆర్ భవన్ సిపిఐ కార్యాలయం వద్ద శత వార్షికోత్సవాల సందర్భంగా సిపిఐ జండా ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సిపిఐ జండా ఆవిష్కరణను సిపిఐ సీనియర్ నాయకులు పొన్నెడి నాగభూషణం చే పతాక ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి చుండూరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం మహోజ్వల పోరాటాల కేతనంగా, కార్మికవర్గ సైద్ధాంతిక శక్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది.1917 అక్టోబరు రష్యా విప్లవం స్పూర్తితో 1925 డిసెంబరు 26 న కాన్పూరులో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుంది.ఆనాటి జాతీయోద్యమంలో కలిసినడుస్తూ సంపూర్ణ స్వాతంత్రం
భారత ప్రజల లక్ష్యంగా పెను
గర్జన చేసింది.దీన్ని సహించ లేని బ్రిటీష్ పాలకులు 32 మంది కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులతో అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారు. ఆరంభ కాలంలోనే కాన్పూరు,మీరట్,పెషావర్ కుట్ర కేసులను కమ్యూనిస్టుపార్టీ ఎదుర్కొంది. ఏఐటీయూసీ ని కార్మికవర్గ హక్కుల వేదికగానే కాకుండా, జాతీయోద్యమంలో భాగం చేసింది. దేశంలో భూమిని,సంపదను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజలచేత వెట్టిచాకిరీ చేయించే ఫ్యూడల్సం స్థానాధీసులకు,జమీందారు లకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు శ్రీకారం చుట్టింది. దున్నేవాడికిభూమి కావాలనే నినాదాన్ని దేశం ముందుకు తెచ్చింది. మార్క్సిజం తాత్విక శక్తితో కమ్యూనిస్టు పార్టీ ఒక
రాజకీయ బౌతికశక్తిగా రూపు
దాల్చింది.ఆకలి,కన్నీళ్లు,దోపిడీలేని సమసమాజం కావాలని సోషలిజాన్ని విరామ మెరుగక ప్రచారం చేసింది. పాలకులు దీని ప్రభావం నుండి
తప్పుకోలేక సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. పార్టీ పుట్టుక నుండి ఈనాటి వరకూ కష్టజీవుల పార్టీగా,నిరుపేదల
ప్రతినిధిగా మొక్కవోని దీక్షా దక్షతలతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..శత వసంతాల
మైలురాయిని చేరుకుంది.అమర వీరుల ఆశయాలను తలపోసుకుని,పునరుత్తేజం తో ముందుకు సాగుతుంది.ప్రతి పేదవాడికి సిపిఐ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు అండగా ఉంటాయని ప్రతి ఉద్యమంలో ముందడుగు వేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా మేలు కొరకు సిపిఐ పనిచేస్తుందని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా సిపిఐ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మన్నెం నారాయణరావు, బలుసుపాడు రాంబాబు,నందిగామ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి,నందిగామ మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు,పట్టణ కార్యదర్శి షేక్ మౌలాలి, పలువురు సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు