Homeఅంతర్జాతీయంజపాన్‌ మాజీ ప్రధాని మురయమ మృతి

జపాన్‌ మాజీ ప్రధాని మురయమ మృతి

- Advertisement -

టోక్యో: జపాన్‌ సోషలిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని తొమిచి మురయమ శుక్రవారం ఓయిటా సిటీలో కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. 1924 మార్చి 3వ తేదీన జన్మించారు. సైన్యం చేరిన ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో కుమమోటో వద్ద విధులు నిర్వర్తించారు. 1972లో దిగువ సభకు ఎన్నికయ్యారు. జపాన్‌ సోషలిస్టు పార్టీకి ఆయన 1993లో అధ్యక్షుడయ్యారు. 1994, జూన్‌ 29వ తేదీన జపాన్‌ 81వ ప్రధానిగా మురియమ బాధ్యతలు స్వీకరించారు. రెండో ప్రపంచ యుద్ధానికి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా 1995లో జరిగిన కార్యక్రమంలో యురయమ ఓ ప్రకటన చేశారు. తప్పుడు జాతీయ విధానం వల్ల జపాన్‌ యుద్ధ కాంక్షను ప్రదర్శించినట్లు చెప్పారు. దీంతో జపాన్‌ ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లినట్లు చెప్పారు. తమ వల్ల అనేక దేశాల ప్రజలు, ముఖ్యంగా ఆసియా దేశాల్లో డ్యామేజ్‌ ఎక్కువగా జరిగిందన్నారు. 2000 సంవత్సరంలో ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు