విశాలాంధ్ర – హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్‌లో మహబూబ్ నగర్ పార్లమెంట్ అడ్‌హాక్ కమిటీ సభ్యులు రాములు యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు సమక్షంలో మహబూబ్ నగర్ టౌన్‌కు చెందిన టెలిఫోన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి బి.సాయన్న గౌడ్, జడ్చర్లకు చెందిన ఆర్.టీ.సీ రిటైర్డ్ సూపరింటెం డెంట్ సి.వెంకటేశ్వర్లు, దేవరకద్ర చెందిన ఆర్‌టీసీ రిటైర్డ్ ఉద్యోగి టి.సత్య షీలా రెడ్డి, దేవరకద్రకే చెందిన ఆర్‌టిసి డిపార్ట్మెంట్ రిటైర్డ్ సూపరింటెం డెంట్ కె.వెంకటయ్యలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బక్కని నరసిం హులు వీరికి తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో గతంలో పార్టీ ద్వారా పదవులు అనుభవించిన అనేకమంది తమ స్వార్ధాల కోసం పార్టీ మారారని, ఈనాడు కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లను అమలుతో పాటు సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీయేనని గుర్తించి స్వఛ్చం దంగా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారని, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. నాయకులు పార్టీని వీడిపోయినా 1 లక్ష 78 వేల మంది తెలుగుదేశం సభ్యత్వం జరిగిందని, ఇందులో పాతవారు 58 వేలు తమ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోగా కొత్తగా 1 లక్ష 20వేల మంది కొత్తగా యువత, మహిళలు పార్టీ సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామని అన్నారు. ఎన్‌టీఆర్ పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు నిజమైన స్వతంత్రతను ఇవ్వగా, చంద్ర బాబు పల్లెల గుమ్మం వద్దకే పాలను తీసుకెళ్లారని, ఇది ఎంతో దైర్యంతో కూడిన చర్య అని అన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావ్ లాంటి వారు కూడా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రజలు తమ ఆలోచనల మేరకు ఏ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనేది నిర్ణయించుకుంటారని, ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిందన్నారు. ఉన్నత పదవులలో ఉన్న వారికి వాక్కు నియంత్రణ ఉండవలసిన అవసరం ఉందని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో యువతకు అవకాశం ఇచ్చి, మహిళలను రాజకీయంగా ప్రోత్సహించి కష్టపడ్డ వారికి ఎం.ఎల్.ఏ, ఎం.పీలుగా అవకాశాలను ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, గూడెపు రాఘవులు, సికంద్రాబాద్ పార్లమెంట్ తెలుగు మహిళా నాయకురాలు జయశ్రీ, సుధాకర్, రాష్ట్ర మీడియా కమిటి ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.