ముంబయి: ఒప్పో ఇండియా నిజమైన డ్యూరబుల్ ఛాంపియన్ ఒప్పో ఎఫ్29 సిరీస్‌తో స్మార్ట్‌ఫోన్ మన్నికను, నెట్‌వర్క్ విశ్వసనీయతకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. భారతదేశం కోసం తయారు చేసిన, భారతదేశంలో పరీక్షించించిన ఎఫ్29 సిరీస్ ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్, మిలిటరీ-గ్రేడ్ దృఢత్వం, అత్యుత్తమ కనెక్టివిటీని, శక్తివంతమైన బ్యాటరీ పనితీరును మిళితం చేస్తుంది. ఇవన్నీ రద్దీగా ఉండే నగర వీధుల నుంచి కఠినమైన భూభాగాల వరకు ప్రతి సవాలుకు సిద్ధంగా ఉండే పల్చని, సొగసైన డిజైన్‌లో ప్యాక్ అయి ఉంటాయి. పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న దుమ్ము, ద్రవాల నుంచి రక్షణను కలిగిన ఒప్పో ఎఫ్29 సిరీస్ అన్ని వాతావరణాలను తట్టుకునేలా తయారు చేశారు.