Homeదండులా కదులుదాం

దండులా కదులుదాం

- Advertisement -

ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేద్దాం

. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
. ఇంటికొకరు కదలిరావాలి
. కదంతొక్కనున్న వేలాది మంది
. కోటి మందికి చేరేలా ప్రచారం
. బస్సులు, వాహనాలు, రైళ్ల ఏర్పాటు
. రామకృష్ణ, ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరగనున్న సీపీఐ శతాబ్ది వార్షికోత్సవ భారీ ప్రదర్శన, బహిరంగ సభ చరిత్ర సృష్టించనుందని, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు ప్రదర్శన, బహిరంగ సభకు ఉత్సాహంగా తరలిరావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జూమ్‌ ద్వారా జరిగింది. విజయవాడ చంద్రం బిల్డింగ్స్‌ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ జల్లి విల్సన్‌, వివిధ జిల్లాల నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. జల్లి విల్సన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ ఖమ్మం బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. రాయలసీమ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు రైళ్లు ఏర్పాట్లు చేసిన అక్కడి జిల్లా నాయకత్వం పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టమని, మళ్లీ అలాంటి రోజు తిరిగి రాబోదన్నారు. జీవితాంతం గుర్తుండే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గతంలో ఏపీ కేంద్రంగా జరిగిన పార్టీ జాతీయసభలకు తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఖమ్మం బహిరంగ సభ ప్రాంగణానికి, ప్రదర్శనకు సకాలంలో ప్రజలు చేరుకోవాలని కోరారు. రైళ్ల ద్వారా వచ్చే ఆయా జిల్లాల నాయకులంతా ఖమ్మం జిల్లాలోని నయాబజార్‌ కళాశాల, శ్రీశ్రీ విగ్రహం, పెవిలియన్‌ గ్రౌండ్‌ (జనసేవాదళ్‌ వలంటీర్లు) నుంచి జరగబోయే ప్రదర్శనకు మన నాయకత్వం బాధ్యత వహించాలని సూచించారు. బహిరంగ సభ అనంతరం 19న పార్టీ జాతీయ సమితి సమావేశం జరుగుతుందన్నారు. 20న జరిగే పార్టీ జాతీయ సెమినార్‌లోను మన రాష్ట్ర నాయకత్వం, జిల్లా కార్యదర్శులు పాల్గొనాలని కోరారు. తప్పకుండా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఖమ్మం సభ విజయవంతం అయ్యేంత వరకు శ్రమించాలని కోరారు.
ఈశ్వరయ్య మాట్లాడుతూ రామకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మంలో జరగనున్న భారీ ప్రదర్శన, బహిరంగ సభకు నూతనుత్తేజంతో ఇంటికొకరు చొప్పున పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. వందేళ్ల చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రం నలుమూలల నుంచి కదంతొక్కాలని కోరారు. మన పార్టీ శతాబ్ది ఉత్సవాల సభకు రైళ్లు, బస్సులు, వాహనాల ద్వారా తరలివెళ్తూనే… మరోవైపు సోషల్‌ మీడియా(ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌) వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. చలో ఖమ్మం పేరుతో విజయవాడ, గుంటూరు, కడప, ఏలూరులో కళాజాతా ప్రదర్శనలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు