Wednesday, November 27, 2024
Homeజాతీయంనిజం బయటకు రావాలి

నిజం బయటకు రావాలి

న్యూదిల్లీ: అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణల అంశాన్ని రూల్‌ 267 కింద పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తడానికి విపక్షాలను అనుమతించక పోవడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ విషయంపై ‘నిజం బయటకు రావాలి’ అని ఆయన అన్నారు. నిబం ధన 267 ప్రకారం, చైర్‌ ఆమోదంతో అత్యవసర విషయంపై చర్చించడానికి అప్పటికే జాబితా చేసిన బిజినెస్‌ నిలిపివేయడం సహజమేనని ఖడ్గే తెలిపారు.
విదేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు కొంతమంది కీలక వ్యాపారులకు సహాయం చేయడం ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని కూడా ఖడ్గే విమర్శించారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ‘‘రూల్‌ 267 అటువంటి ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడానికి మాత్రమే రూపొందించబడిరది. ఆ అవకాశం లేకపోతే, ఆ నియమం ఉండకూడదు. ఈ నియమం ప్రకారం ఈ సమస్యను లేవనెత్తడానికి మాకు అనుమతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము’’ అన్నారు. జేపీసీలో అధికార బీజేపీ నుంచే ఎక్కువ మంది సభ్యులుంటారని… అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. జేపీసీని ఏర్పాటు చేయండి… నిజం బయటకు రానివ్వండి అని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. పార్లమెంటులో ఉభయ సభలు వాయిదా పడడానికి గల కారణాలేంటో తనకు తెలియదని ఖడ్గే అన్నారు. అదానీ గ్రూప్‌పై అవినీతి, లంచం, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని రక్షించేందుకు ఈ అంశాన్ని లేవనెత్తడం చాలా ముఖ్యమని… మోదీ జీ మాత్రం హంగామా సృష్టిస్తున్నారని చెప్పారు. పార్లమెంటును ప్రతిపక్షాలే స్తంభింపజేస్తున్నాయన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అవినీతిపరులకు వెన్నుదన్నుగా నిలుస్తూ స్వయంగా మోదీనే దేశ ప్రతిష్ఠను చెడగొడుతున్నారన్నారు. కాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ… ‘మోదానీ సమస్య ఈరోజు లోక్‌సభ మరియు రాజ్యసభ రెండిరటినీ కుదిపేసింది. మోదానీ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఇండియా కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రజాధనం లంచం ఇవ్వడానికి ఉపయోగించబడిరది. మేము ఈ విషయాన్ని సభ ద్వారా దేశానికి చెప్పాలనుకుంటున్నాము’ అన్నారు. మోదీజీ ఎక్కడికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా… అదానీకి కాంట్రాక్టులు లభిస్తాయి. చాలా పెద్ద జాబితా ఉంది. అందుకే దీనిపై సభలో నిర్మొహమాటంగా చర్చించాలని కోరామని జైరామ్‌ తెలిపారు. ‘దేశానికి హాని జరుగుతున్నప్పుడు ఈ సమస్యలను సభ ముందుకు తీసుకురావడం చాలా ముఖ్యం. దాని కారణంగా ప్రపంచం మనపై విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది’ అని జైరామ్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు