వాషింగ్టన్: రష్యా`ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న క్రమంలో మంగళవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడే అవకా శాలు ఉన్నాయి. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందంపై పుతిన్‌తో మాట్లాడనున్నట్లు చెప్పారు. ‘పుతిన్‌తో ఫోన్లో సంభా షించే అవకాశాలు ఉన్నాయి. గత వారం శాంతి ఒప్పందం కోసం అనేక చర్యలు చేపట్టాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేం దుకు ప్రయత్నిస్తాం. భూభాగం అప్పగింత గురించి మాట్లాడుతాం. పవర్ ప్లాంట్ల గురించి కూడా చర్చిస్తాం’ అన్నారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు పుతిన్, ట్రంప్ చర్చిస్తారని కొన్ని రోజుల క్రితం అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. ఇటీవల మాస్కోలో పుతిన్‌తో విట్కాఫ్ భేటీ అయ్యారు. ఆ చర్చలు పాజిటివ్‌గా ముగిసినట్లు ఆయన చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ వర్గాలు.. చర్చలు చేపట్టేందుకు సము ఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల అమెరికా నేతృత్వంలో జెడ్డాలో జరిగిన భేటీలో ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే ఆ ప్రతిపాదనకు రష్యా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని షరతులు విధించిన క్రమంలో ట్రంప్, పుతిన్ ఫోన్ చర్చలు కీలకం కానున్నాయి.
టారిఫ్‌లపై వెనక్కు తగ్గం…
తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై భారీగా ప్రతి సుంకాలుంటాయని హెచ్చరించిన ట్రంప్… ఆ విషయంలో తగ్గేదేలేదని… తమ వ్యాపార భాగస్వాములపై ఏప్రిల్ 2 నుంచి సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సుంకాలపై ఏ దేశానికీ మినహాయింపులు కల్పించే ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 2 మన దేశానికి విముక్తి కలిగించే రోజు. ఇదివరకు అధికారంలో ఉన్న తెలివి తక్కువ అధ్యక్షులు తాము ఏమి చేస్తున్నామో కూడా తెలియకుండా మన సంపదను ఇతరులకు ఇస్తూ పోయారు. ప్రస్తుతం విధిస్తున్న సుంకాల ద్వారా అందులో కొంత భాగాన్ని తిరిగి పొందబోతున్నాము. ఇన్నాళ్లు వారు మన నుంచి వసూలు చేశారు. వాటన్నిటినీ తిరిగి వసూలుచేసుకోవడానికి ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధిస్తున్నాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.