Homeనేపాల్‌ ప్రధానిరాజీనామా

నేపాల్‌ ప్రధానిరాజీనామా

- Advertisement -

. దుబాయ్‌ పారిపోయేందుకు యత్నం
. అట్టుడుకుతున్న నేపాల్‌
. రణరంగాన్ని తలపిస్తున్న కాట్మండు
. మాజీ ప్రధాని భార్య సజీవదహనం
. ప్రభుత్వ భవనాలకు, ప్రధాని నివాసానికి నిప్పు
. ఆర్థిక మంత్రిని వీధుల్లో తరుముతూ కొట్టిన వైనం
. సైన్యం చేతుల్లోకి పాలన

కాట్మండు: హిమాలయ దేశం నేపాల్‌ యువత నిరస నలతో అట్టుడుకుతోంది. ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులే లక్ష్యంగా ఆందోళనకారులు రెచ్చిపోతు న్నారు. కర్ఫ్యూ ఆంక్షలు, భద్రతా బలగాలను లెక్కచేయకుండా… ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. నేపాల్‌ ఆందోళనల్లో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌ మాజీ ప్రధాన మంత్రి రaలనాథ్‌ ఖానాల్‌ నివాసానికి నిరసనకారులు నిప్పటించడంతో మంటల్లో చిక్కుకున్న ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్‌ సజీవదహనమయ్యారు. రాజధాని కాట్మండులోని దల్లు ప్రాంతంలో రaాలనాద్‌ నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో కీర్తిపూర్‌లోని ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. మరోపక్క సోషల్‌ మీడియాపై విధించిన నిషేధంతో మొదలైన నిరసనలు…అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి దేశంలో అల్లకల్లోలం రేపాయి. కాట్మండు సహా వివిధ జిల్లాల్లో యువత, విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రజలు గుమిగూడకూడదని ఆంక్షలున్నా లెక్కచేయకుండా ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 400 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో వందమంది పోలీసులు కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినా నేపాల్‌లో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ప్రధాని ఓలి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆందోళనల్లో మరణాలకు బాధ్యత వహిస్తూ కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని, దేశాన్ని విడిచిపోవాలంటూ రెండో రోజూ మంగళవారం యువత రోడెక్కారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్‌ చేశారు. భక్తాపూర్‌లోని బాల్‌కోట్‌లో ఉన్న ఓలీ ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు. తర్వాత బల్వతార్‌లోని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ సాయంత్రం ఆరు గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. పరిస్థితి చక్కదిద్దుదామని యత్నించిన ఓలి, చర్చలతోనే సంక్షోభం పరిష్కారమవుతుందని చెప్పారు. ఈలోపే తన అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనకారుల దాడులు కేవలం ప్రధాని నివాసానికి, ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామ్‌ చంద్ర పౌడెల్‌ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ), షేర్‌ బహదూర్‌ డ్యూబాల ఇళ్లు, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలపై దాడులు చేసి నిప్పుపెట్టారు. కాగా, ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌడేల్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిరసనకారులు ఆయన్ను వీధుల్లో వెంబడిరచి కొట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌడేల్‌ వారికి కనిపించడంతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆయన వీధుల్లో పరుగెడుతుండగా ఆందోళనకారులు దాడి చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆయన పరుగెడుతుండగా ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరి తన్నిన దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి మంత్రి మళ్లీ లేచి పరుగెత్తారు. ఈ దాడులు ఆర్థిక మంత్రికే పరిమితం కాలేదు. నేపాల్‌ మాజీ ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవుబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి అర్జు రాణా దేవుబాలను కూడా నిరసన కారులు లక్ష్యంగా చేసుకున్నారు. వీరిపై కూడా ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. మంత్రులు పృథ్వీ సుబ్బ గురుంగ్‌, రమేశ్‌ లేఖక్‌, యూఎంఎల్‌ నేత మహేశ్‌ బాస్నేట్‌, నేపాలీ కాంగ్రెస్‌ నేత గగన్‌థాపాతో సహా కొందరు కీలక నేతల నివాసాలు, కార్యాలయాలు దాడులకు గురయ్యాయి. కాట్మండులోని నేపాలీ కాంగ్రెస్‌, యూఎంఎల్‌ పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. నిరసనల సందర్భంగా 20 మంది పౌరులు మృతి చెందడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. కాట్మండు రింగ్‌ రోడ్‌ పరిధిలో నిరవధిక కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో నిరసనలు, సమావేశాలు, సభలపై పూర్తి నిషేధం విధించినట్లు కాట్మండు జిల్లా అధికారి ఛబిలాల్‌ రిజాల్‌ వెల్లడిరచారు.
వరుసగా మంత్రుల రాజీనామాలు
వరుసగా రెండోరోజూ ఆందోళనలు కొనసాగడంతో నేపాల్‌ వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్‌ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం నిరనసకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండిరచారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఆరోగ్య, జనాభా శాఖ మంత్రి ప్రదీప్‌ పౌడ్యాల్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్‌ హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ రాజీనామా చేశారు. యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి కాట్మండూ, భక్తాపూర్‌, లలిత్‌పూర్‌ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినా నిరసనకారులు విధ్వంసం కొనసాగించారు.
సైన్యం చేతుల్లోకి పాలన పగ్గాలు
మరోవైపు ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీ నామాతో నేపాల్‌ పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. రాజీనామాకు ముందే కేపీ శర్మ ఓలీ నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దెల్‌తో మాట్లాడారు. దేశం విడిచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు పేర్కొన్నాయి. ఓలి దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఓలి రాజీనామాతో మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇదేసమయంలో త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి సైనిక హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాట్మండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి వీఐపీలను తరలించారు. కాగా , ప్రధాని రాజీనామా చేసినప్పటికీ, దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అధ్యక్షుడి అధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తున్నా, త్వరలోనే అది కూడా కూలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైన్యం పాలన చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు